Read more!

English | Telugu

మిత్రవింద సర్దార్ అంత సాఫ్ట్ కాదు..!

కాజ‌ల్ అగ‌ర్వాల్..థ‌ర్టీ ప్ల‌స్ లోనూ యంగ్ హీరోయిన్ల కంటే స్పీడుగా సినిమాల మీద సినిమాలు చేసేస్తోంది. టాలీవుడ్ టాప్ స్టార్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేశ్ బాబుల సినిమాల్లో న‌టిస్తున్న ఈ సుందరి పవ‌ర్ స్టార్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కాజ‌ల్ ఎక్క‌డుంటే అక్క‌డ ఉత్సాహ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంటుంది. చుట్టూ ఉన్న వాళ్ల‌ని క‌డుపుబ్బా న‌వ్విస్తూ సంద‌డి చేస్తుంది కాజ‌ల్. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో బాబీ ద‌ర్శ‌క‌త్వంలో కాజ‌ల్ న‌టించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సెట్ లోనూ ఇలాంటి పండ‌గ వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేసింది. షూటింగ్ విరామ స‌మ‌యంలో సర్దార్ వాడిన గ‌న్ తీసుకుని అడ్డోస్తే కాల్చేస్తానంటూ తోటి న‌టిన‌టుల్ని ఆద‌ర‌గొట్టిందట కాజ‌ల్. ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అంటే కాజ‌ల్ పైకి క‌నిపించేంత సాఫ్ట్ కాద‌న్న‌మాట‌.