English | Telugu

పవన్ కళ్యాణ్ వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పిల్ వేసిన హిందువులు 

కలియుగ దైవం శ్రీ ఏడుకొండలవాడి దివ్యప్రసాదమైన తిరుపతి లడ్డు(tirupati laddu)ని హిందువులంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు.గత ప్రభుత్వ హయాంలో లడ్డు విషయంలో అపచారం జరిగిందనే వార్తలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులతో పాటు హిందువులంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)అయితే ప్రాయచ్చిత దీక్షని కూడా చేపట్టారు.

ఆ సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టకి కూడా కల్తీ జరిగిన తిరుపతి లడ్డులు వెళ్లాయని వ్యాఖ్యానించాడు.పవన్ చేసిన ఆధారాలు లేని ఈ వ్యాఖ్యల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు,ప్రజల్లో విద్వేషాలు పెంచేలా ఉన్నాయని, ప్రముఖ న్యాయవాది ఇమ్మనేని రామారావు హైదరాబాద్ లోని నాంపల్లి సిటీ సివిల్ కోర్ట్ లో పిల్ ని దాఖలు చేసారు. సోమవారం నాడు ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద దాఖలైన ఈ పిల్ లో మరిన్నిఅంశాలు కూడా ఉన్నాయి.

పవన్ చేసిన వ్యాఖ్యలుప్రముఖ చానల్స్, పత్రికలు, సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం అయ్యాయని, సామజిక మాధ్యమాలలోని ఆ వ్యాఖ్యలు తొలగించాలని,ఇంకో సారి పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు మాట్లాడకుండా నిషేధ ఉత్తర్వులు కూడా జారీ చెయ్యాలని పిల్ లో  కోరాడు. మంగళవారం ఈ పిల్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.