English | Telugu

పవన్ గబ్బర్ సింగ్ స్టిల్స్ ఒరిజినల్ కాదు

పవన్ "గబ్బర్ సింగ్" స్టిల్స్ ఒరిజినల్ కాదు అని ఆ చిత్ర నిర్మాత గణేష్ మీడియాకి స్వయంగా తెలియజేశారు. వివరాల్లోకి వెళితే పరమెశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, "షాక్, మిరపకాయ్" సినిమాలకు దర్శకత్వం వహించిన యువ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ నిర్మిస్తున్న చిత్రం"గబ్బర్ సింగ్". బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నిర్మించిన సూపర్ హిట్ "దబాంగ్" చిత్రానికి రీమేక్ ఈ "గబ్బర్ సింగ్". పవన్ "గబ్బర్ సింగ్" తాలూకు స్టిల్స్ ఈ మధ్య కొన్ని వెబ్ సైట్స్ లో కనపటంతో, అవి నిజంగా "గబ్బర్ సింగ్" సినిమా కోసం తీసిన స్టిల్స్ కావని, కొందరు అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు తమంతట తామే స్వయంగా తయారుచేశారని నిర్మాత గణేష్ అంటున్నారు.

ఈ విషయం మీద స్పందిస్తూ "నేను అభిమానుల ఆతృతను అర్థం చేసుకోగలను.వారికి ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారిని "గబ్బర్ సింగ్" సినిమాలో హీరోగా చూద్దామని కోరికగా ఉంటుంది. అందుకే ఇలా కొన్ని ఫేక్ స్టిల్స్ తయారుచేసి నెట్‍ లో పెట్టారని నాకర్థమయ్యింది. కానీ మేమింత వరకూ "గబ్బర్ సింగ్" ఫొటో షూట్ నిర్వహించలేదు"అని నిర్మాత గణేష్ అన్నారు. ఈ సినిమా లొకేషన్స్ వెతుకుతున్నారు. ఈ చిత్రం కోసం హిందీ చిత్రం "ఓంకార" చిత్రీకరించిన ప్రదేశాలను ఎంచుకుంటున్నారనీ వినికిడి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.