English | Telugu

'లైలా కోసం' తొందరపడుతున్న నాగచైతన్య

అక్కినేని నాగచైతన్య తన లైలా ప్రేమను దక్కించుకోవడానికి చాలా తొందరపడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘ఒక లైలా కోసం’ సినిమా అనుకున్న టైమ్ కంటే ఒకవారం ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని ముందుగా సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అక్కినేని అభిమానులకు కింగ్ నాగార్జున బర్త్ డే గిఫ్ట్ గా ఆగష్టు 29న ‘ఒక లైలా కోసం’ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకొని త్వరలో సెన్సార్ కు వెళ్ళనుంది. ఇండిపెండెంట్ గా ఉండాలనుకునే ఓ యువకుడు తను ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేశాడనే కథాంశంతో సినిమా తెరకెక్కుతోంది. నాగచైతన్య, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ఈచిత్రాన్ని ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్‌కుమార్ కొండా దర్శకత్వం వహించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.