English | Telugu

యన్ టి ఆర్ ఊసరవెల్లిలో సమీరా ఐటం సాంగ్ లేదు

యన్ టి ఆర్ "ఊసరవెల్లి" లో సమీరా ఐటం సాంగ్ లేదు అని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, తమన్నా భాటియా హీరోయిన్ గా, "కిక్ ‍" సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, "ఛత్రపతి"ఫేం బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న విభిన్నకథాచిత్రం "ఊసరవెల్లి". యన్ టి ఆర్ "ఊసరవెల్లి" చిత్రంలో సమీరా రెడ్డి ఒక ఐటం సాంగ్ లో నటిస్తుందని ఆ మధ్య రూమర్లొచ్చాయి. కానీ అవేవీ నిజంకాదని సమీరారెడ్డి కొట్టిపారేసింది.

సమీరా రెడ్డి గతంలో తెలుగులో "అశోక్, నరసింహుడు" చిత్రాల్లో యన్ టి ఆర్ సరసన, "జై చిరంజీవ" చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించింది. ఈ మూడు చిత్రాలూ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటం విశేషం. వక్కంతం వంశీ కథను అందించిన ఈ యన్ టి ఆర్ "ఊసరవెల్లి" చిత్రం రానున్న దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ నెలలో విడుదల కానుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.