Read more!

English | Telugu

ఎన్టీఆర్ కు ఆ డైరెక్టర్ నచ్చాడా..?

అందాల రాక్షసితో డైరెక్టర్ గా టాలెంట్ ప్రూవ్ చేసుకున్నా, సాలిడ్ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు హను రాఘవపూడి. అందుకే ఈసారి, కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి నానితో కృష్ణగాడి వీర ప్రేమగాథ తీశాడు. ఈ సినిమాతో మాత్రం సేఫ్ జోన్లోకి వచ్చేశాడు. ద్వితీయ విఘ్నాన్ని సక్సెస్ ఫుల్ గా దాటేయడంతో, హనుకు అవకాశాలు లైన్ కడుతన్నాయి. తాజా సమాచారం ప్రకారం, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హను రాఘవపూడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రస్తుతం జనతా గ్యారేజ్ పనుల్లో ఉన్న ఎన్టీఆర్, ఆ తర్వాత హను సినిమాలో నటించబోతున్నాడట. తన మూడో సినిమాకే మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం హను రాఘవపూడికి అదృష్టమనే చెప్పాలి. ఒకవేళ ఎన్టీఆర్ తో మాంచి మాస్ హిట్ కొట్టాడంటే, ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరుకుంటాడనడంలో డౌట్ లేదు. మరి ఎన్టీఆర్ రూట్ లోకి హను వెళ్తాడో, లేక హను రూట్లోకి ఎన్టీఆర్ వస్తాడో చూడాలి..