English | Telugu

యన్ టి ఆర్ పెళ్ళి సెట్ 18 కోట్లతో అదుర్స్

యన్ టి ఆర్ పెళ్ళి సెట్ 18 కోట్లతో అదుర్స్ అని తెలుగు సినీ వర్గాలంటున్నాయి. యన్ టి ఆర్ పెళ్ళి కోసం కళాదర్శకులు ఆనంద సాయి నేతృత్వంలో 160 అడుగుల ఎత్తులో 250 మంది రాత్రి పగలు శ్రమిస్తూ నిర్మిస్తున్న పెళ్ళి సెట్ చాలా భారీగా, హుందాగా, అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా ఆనందసాయి తానూ ఒక కార్మికుడిలా ఈ పెళ్ళి సెట్ కోసం కష్టపడటం విశేషం. అసలు యన్ టి ఆర్ పెళ్ళి శుభలేఖ సినీ, రాజకీయ పెద్దలందరి నుండీ ప్రశంసలనందుకుంది. ఆ శుభలేఖలో ఎక్కడా తన ఫొటో లేకుండా ఉండటం, తనకన్నా తన తన కుటుంబానికి సంబంధించిన పూర్వీకులకే యన్ టి ఆర్ అత్యధిక ప్రాముఖ్యతనివ్వటం అందుకు కారణం.

యన్ టి ఆర్ పెళ్ళి శుభలేఖ ఖరీదే మూడువేల రూపాయలని వినికిడి. ఇక యన్ టి ఆర్ పెళ్ళి కూడా చాలా సాంప్రదాయబద్ధంగా, హిందూ వివాహ వ్యవస్థ విధించిన ఆచారవ్యవహారాల ప్రకారం జరపటానికి వేదవేదాంగపారాయణులైన పన్నెండుమంది సద్బ్రాహ్మణులతో చేయబడుతుందట. పెళ్ళిలో యన్ టి ఆర్ పట్టు పంచెతో పెళ్ళి కొడుకులా కనిపించబోతుంటే, పెళ్ళి కూతురు లక్ష్మీ ప్రణతి పట్టుచీరలో కనిపించనుందట. ఇక భోజనాలు మన తెలుగు సాంప్రదాయం ప్రకారం నవకాయ పిండివంటలతో షడ్రషోపేతమైన విందు భోజనాన్ని అతిథులకు అదించనున్నారట. కార్ పార్కింగ్ కోసం నిర్దిష్టమైన ప్రదేశాన్ని ఎంపిక చేశారు. అలాగే అభిమానుల కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారట. అభిమానులు యన్ టి ఆర్ వివాహం దగ్గరనుండి చూడటానికి వీలుగా కళ్యాణ మంటపం బయట పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు.యన్ టి ఆర్ పెళ్ళి మే 5 వ తేదీ రాత్రి 2.41 గంటలకు జరుగుందని ప్రేక్షకులకు తెలిసిందే.