Read more!

English | Telugu

మలబార్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్ గా యన్ టి ఆర్

మలబార్ గోల్డ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా యన్ టి ఆర్ వ్యవహరించనున్నారు. వివరాల్లోకి వెళితే బంగారు ఆభరణాలను తయారుచేసే కేరళకు చెందిన ప్రముఖ సంస్థ "మలబార్ గోల్డ్" కంపెనీ తమ ఉత్పత్తులకు పబ్లిసిటీ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా యన్‍ టి ఆర్ ని ఎన్నిక చేసింది.ఏప్రెల్ 10 వ తేదీన హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆ సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది.

 

ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్ గా యన్ టి ఆర్ మాట్లడుతూ బంగారు ఆభరణాలను పెట్టుకునేది ఆడవాళ్ళే అయినా వాటిని కొనేది మాత్రమ మగవాళ్ళే కాబట్టి ఈ మలబార్ గోల్డ్ కంపెనీ తనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకునుంటుందనీ, తనకు బంగారు ఆభరణాల గురించి ఏం తెలుసాని అందరూ అనుకోవచ్చనీ, తనకు మరో ఇరవై రోజుల్లో వివాహం కాబోతుందనీ, తనకంటే బంగారు ఆభరణాల గురించి ఇంకెవరికి బాగా తెలుస్తుందనీ అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడటానికిది వేదిక కాదూ, ఇది సమయమూ కాదనీ, తన తండ్రి గారు ఆ విషయం చూసుకుంటారనీ ఆయన సమాధానం దాటవేశారు.