Read more!

English | Telugu

ముంబై లో పది రోజుల పాటు ఎన్టీఆర్.. వార్ లుక్ వైరల్  

లుక్స్ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr)ది వెరీ స్పెషాలిటీ. తన ప్రతి సినిమాలోను లుక్స్ విషయంలో చాలా  జాగ్రత్తలు తీసుకుంటాడు. పైగా ఆ లుక్స్ కూడా సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక  అప్ కమింగ్ మూవీ  దేవరలో ఆయన లుక్ ఎలా ఉండబోతుందో అందరకి తెలిసిపోయింది.ఒక డిఫరెంట్ లుక్ తో ఉండి దేవర (devara) మీద అంచనాలని పెంచింది.  దీంతో  మరో అప్ కమింగ్ మూవీ వార్  2 (war 2) లో లుక్ ఎలా ఉండబోతోందనే  చర్చ అందరిలో వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని  ఫోటోలు వైరల్ గా మారాయి.


ఎన్టీఆర్ ప్రెస్టేజియస్ట్ మూవీస్ లో  వార్ 2  కూడా ఒకటి. పైగా ఎన్టీఆర్ నటిస్తున్న మొట్ట మొదటి హిందీ మూవీ కూడా ఇదే. రీసెంట్ గా  ముంబై లో ల్యాండ్ అయ్యాడు. రేపట్నుంచి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ మేరకు మూవీలో ఆయన లుక్ ఎలా  ఉండబోతుందో రివీల్ అయ్యింది. కొంత మంది విలేకర్లు ఎన్టీఆర్ ని  వీడియో కూడా తీశారు. లైట్ షేవింగ్ తో ఒక లెవల్ లో ఉన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియా లో ఆ పిక్స్  సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక  పది రోజులు పాటు  షూటింగ్ లో పాల్గొంటాడు అని తెలుస్తుంది.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న  వార్ 2 లో  హృతిక్ రోషన్ (hrithik roshan) తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.ఆయన ఎలాంటి క్యారక్టర్ ని చెయ్యబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది. 2019 లో వచ్చిన వార్ మూవీకి సీక్వెల్ గా వార్ 2  తెరకెక్కుతుంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్  200 కోట్ల భారీ బడ్జట్ తో నిర్మిస్తుంది. గేమ్ చేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది. జాన్ అబ్రహం మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.అగస్ట్ 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.