Read more!

English | Telugu

ఒకే సినిమాలో హరికృష్ణ, యన్ టి ఆర్

ఒకే సినిమాలో హరికృష్ణ, యన్ టి ఆర్ కలసి నటిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ క్రియేటీవ్ కమర్షియల్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, బోయపాటి శీను దర్శకత్వంలో కె.యస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం "టైగర్" (ఈ పేరు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది). ఈ సినిమాలో యన్ టి ఆర్ కన్నతండ్రి నందమూరి హరికృష్ణ, యంగ్‍ టైగర్ యన్ టి ఆర్ ఇద్దరూ కలసి నటిస్తున్నారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

నిజజీవితంలో తండ్రీ కొడుకులైన వీరిద్దరూ వెండితెర మీద కూడా తండ్రీ కొడుకులుగానే ఈ సినిమాలో కనిపించబోతున్నారట. ప్రస్తుతం యన్ టి ఆర్ మారిషస్ లో హనీ మున్ ట్రిప్ లో ఉన్నాడు. అక్కడి నుండి ఇండియాకు తిరిగి రాగానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట. అమటే బహుశా మే నెల చివరి నుండి ఈ సినిమా షుటింగ్ లో యన్ టి ఆర్ పాల్గొనే అవకాశాలున్నాయి.