English | Telugu

దేవర టాక్ లో రాజకీయ కోణం దాగి ఉందా! అందుకే మెగా,నందమూరి వార్ ని తెరమీదకి తెస్తున్నారా!

దేవర(devara)ట్రైలర్  రిలీజ్ ఈవెంట్ ఇటీవల ముంబై వేదికగా చాలా గ్రాండ్ గా జరిగింది. ఎన్టీఆర్(ntr)తో పాటు చిత్ర దర్శకుడు కొరటాల శివ(koratala siva)ప్రముఖ  హిందీ దర్శకుడు కరణ్ జోహార్(karan johar)తో పాటు ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ మీడియా సమావేశంలో దేవర కి సంబంధించిన పలు విషయాల గురించి మాట్లాడాడు. ఇప్పడు ఆ మాటలని కావాలని కొంత మంది నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు. పైగా మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ వార్ అంటూ అర్ధం పర్ధం లేని వాదనలని తెర మీదకి తీసుకొస్తున్నారు. 

చిరంజీవి(chiranjeevi)గతంలో తన వాల్తేరు వీరయ్య సినిమాకి సంబంధించిన ఒక  ఫంక్షన్ లో మాట్లాడుతు దర్శకుడు అనే వ్యక్తి  సూపర్ డూపర్ హిట్ చిత్రాలని ఇవ్వడం కాదు. అనుకున్న బడ్జెట్ లో అనుకున్న టైం కి సినిమా బయటకి వచ్చేలా  తెరకెక్కించినప్పుడే డైరెక్టర్ అనే వ్యక్తి నిజమైన సక్సెస్ ని అందుకున్నట్టు. కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే  వాళ్ళ పని తనం చూపించుకోవడానికి దాని కోసం అర్రులు చాచుతున్నారు. అలా కాకుండా మాములు కెమెరాతోనే  కథ ని నమ్ముకొని అద్భుతమైన సినిమా తియ్యగలనని అనుకోవాలి. అలాగే అవసరం మేరకు టెక్నాలజీ ని కూడా యూజ్ చేసుకోవాలని చెప్పాడు.ఇక దేవర ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవర కథ కన్నా కూడా  అంత కంటే ఎక్కువగా విజువల్స్ అద్భుతంగా ఉంటాయి.సినిమా చివరి నలభై నిముషాలు ప్రేక్షకులందర్నీ విశేషంగా ఆకట్టుకుంటుంది. సినిమా సినిమాకి కొరటాల శివ పై నా ప్రేమ, గౌరవం పెరుగుతూనే ఉంటాయి .ఆయన హీరో కమర్షియల్ గా ఉంటూనే ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ ముందుకు వెళ్తుంటాడు.కానీ దేవర మాత్రం  ఇందుకు భిన్నంగా ఉంటుంది.అండర్ వాటర్ లో ముప్పై ఎనిమిది రోజులు చిత్రీకరణ చేసాం. పక్కా హై ఓల్టేజ్ యాక్షన్ తో రాబోతుందని చెప్పుకొచ్చాడు. 

ఇప్పుడు ఈ రెండు స్పీచ్ లకి కావాలని కొంత మంది సోషల్ మీడియా వేదికగా లింకులు పెడుతున్నారు. ఆ రోజు చిరంజీవి ఆచార్య ప్లాప్ విషయంలో కొరటాల ని ఉద్దేశించి అన్నాడని, ఇప్పుడు ఎన్టీఆర్ చిరు మాటలకి కౌంటర్ గా అలా మాట్లాడని అంటున్నారు. మెగా అండ్ నందమూరి అభిమానులు మాత్రం అవన్నీ కావాలని ఎవరో క్రియేట్ చేస్తున్నారని, రాజకీయ కోణం కూడా దాగి ఉండవచ్చనే  అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. చిరు తనయుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రాణ స్నేహితులన్న విషయం అందరకి తెలిసిందే. అలాగే ఎవరు ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసినా  రేపు  ఇరవై ఏడు న దేవర ఘన విజయం సాధించడం మాత్రం పక్కా. ఇప్పటికే అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంది.