Read more!

English | Telugu

ఆమిర్ ఖాన్‌ను ఓడించిన నిఖిల్‌!

 

ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించిన 'లాల్ సింగ్ చ‌డ్ఢా'.. 2022లో ప్రేక్ష‌కులు అత్యంత ఆత్రుత‌తో ఎదురుచూసిన సినిమాల్లో ఒక‌టి. మిక్స్‌డ్ రివ్యూస్‌తో ఓపెన్ అయిన ఆ మూవీ, వారం కూడా తిర‌క్క ముందే డిజాస్ట‌ర్‌గా పేరు తెచ్చుకుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అక్ష‌య్ కుమార్ మూవీ 'ర‌క్షా బంధ‌న్‌'తో ఆ సినిమా పోటీ ప‌డింది. అయితే రెండు సినిమాలూ ఫ్లాప‌య్యాయి. ఇప్పుడు ఆగ‌స్ట్ 13న రిలీజైన నిఖిల్ మూవీ 'కార్తికేయ 2' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 'లాల్ సింగ్ చ‌డ్ఢా' క‌లెక్ష‌న్ల‌ను తినేయ‌డం మొద‌లుపెట్టింది. ఆమిర్ ఖాన్ సినిమా కంటే టాలీవుడ్ నుంచి వ‌చ్చిన ఈ సినిమా ఎక్కువ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది.

'లాల్ సింగ్ చ‌డ్ఢా' రిలీజైన రెండు రోజుల‌కు విడుద‌లైన 'కార్తికేయ 2' గురువారం రూ. 2.16 కోట్ల షేర్ క‌లెక్ట్ చేసింది. మొత్తం 6 రోజుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా వ‌సూళ్లు రూ. 23.66 కోట్ల షేర్‌కు చేరాయి. తెలుగు రాష్ట్రాల వ‌ర‌కైతే ఇది రూ. 16.66 కోట్ల షేర్‌. దీని ఓవ‌రాల్ బిజినెస్ వాల్యూ రూ. 12.80 కోట్లుగా ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి. ఇత‌ర ఖ‌ర్చులన్నీ క‌లిపి రూ. 50 ల‌క్ష‌లు అనుకుంటే బ్రేకీవెన్ మార్క్ రూ. 13.30 కోట్లు. అంటే ఇప్ప‌టికే రూ. 10.36 కోట్ల‌ను బ‌య్య‌ర్లు లాభంగా ఆర్జించార‌న్న మాట‌.

'కార్తికేయ 2' హిందీ వెర్ష‌న్ విష‌యం చూసుకున్నా గురువారం ఈ మూవీ 1.65 కోట్ల నెట్‌ను రాబ‌డితే, 'లాల్ సింగ్ చ‌డ్ఢా' వ‌సూలు చేసింది రూ. 1.35 కోట్ల నెట్ మాత్ర‌మే. తెలుగులో నిఖిల్ ఓ మామూలు హీరో అనే విష‌యం తెలిసిందే. అలాంటిది అత‌ను న‌టించిన ఓ తెలుగు సినిమా హిందీ వెర్ష‌న్ ఆమిర్ ఖాన్ లాంటి సూప‌ర్‌స్టార్ సినిమా కంటే ఎక్కువ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం అనేది పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. చందూ మొండేటి రూపొందించిన 'కార్తికేయ 2', 2014లో వ‌చ్చిన హిట్ ఫిల్మ్ 'కార్తికేయ‌'కు సీక్వెల్‌. ఈ మూవీలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, అనుప‌మ్ ఖేర్‌, శ్రీ‌నివాస‌రెడ్డి, ఆదిత్య మీన‌న్‌, వైవా హ‌ర్ష కీల‌క పాత్ర‌ధారులు.