English | Telugu
కెజిఎఫ్, సలార్ స్థాయిలో ‘బఫీుర’.. ఆడియన్స్‌ని థ్రిల్ చేసే మరో యాక్షన్ ఎంటర్‌టైనర్!
Updated : Oct 21, 2024
‘జనాన్ని కాపాడ్డానికి ఖాకీనే వెయ్యాల్సిన అవసరం లేదు.. కాపాడే మనసుంటే చాలు’.. ఇదీ ‘బఫీుర’ నినాదం. పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న ఒక యువకుడు సమాజంలో పాతుకుపోయిన దుష్టశక్తులను అంతమొందించడానికి ‘బఫీుర’గా ఎందుకు మారాడు, పోలీసులకు సవాల్‌గా ఎలా నిలిచాడు అనే కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా ఇది. కెజిఎఫ్, సలార్ చిత్రాల్లో ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఆ సినిమాల పోలికలతోనే మరో కన్నడ సినిమా రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ కథ మాత్రమే అందించారు. డా.సూరి దర్శకత్వం వహించారు. కెజిఎఫ్, సలార్ చిత్రాలను ఎంతో భారీగా నిర్మించిన విజయ్ కిరగంధూర్.. హొంబలే ఫిలింస్ పతాకంపై ‘బఫీురా’ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రశాంత్ నీల్ తొలి చిత్రం ‘ఉగ్రం’ చిత్రంలో హీరోగా నటించిన శ్రీమురళి ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించడం విశేషం. డా.సూరి ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు అందించడంతోపాటు దర్శకత్వం వహించారు.
ట్రైలర్‌లోని అంశాలు చూస్తే సినిమాను ఎంత భారీ స్థాయిలో నిర్మించారో అర్థమవుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించే వేదాంత్ అనే యువకుడు హత్యలు చేసే రాక్షసుడుగా ఎందుకు మారాడు అనే కథాంశంతో ఎంతో ఇంట్రెస్టింగ్‌గా రూపొందిన సినిమా ‘బఫీుర’. బాలీవుడ్ మూవీ బ్లాక్ పాంథర్ తరహాలో భారీ యాక్షన్స్‌తో సినిమాను నింపేశారు. దాంతోపాటు చక్కని సెంటిమెంట్ కూడా ఉందని ట్రైలర్‌లోని అమ్మ క్యారెక్టర్ మాటలు వింటే అర్థమవుతుంది. ‘ఎందుకమ్మా దేవుడు రామాయణం, మహాభారతం అంటూ ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఎప్పుడూ ఎందుకు రాడు’ అని కొడుకు అడిగిన ప్రశ్నకు ‘దేవుడు అన్నిసార్లూ రాడు. సమాజంలో పాపాలు మితిమీరినపుడు, మంచిని చెడు తొక్కేసినపుడు, సమాజంలో కుళ్ళు పెరిగినపుడు, మనుషులు మృగాలైనప్పుడు ఆయన అవతారమెత్తుతాడు. ఆయనిప్పుడు దేవుడులాగే కాదు, రాక్షసుడిలా కూడా రావచ్చు’ అంటూ తల్లి చెప్పే మాటలే ఈ సినిమాకి మూలంగా కనిపిస్తాయి.
ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా అవతరించిన ‘బఫీుర’ తన కార్యకలాపాలను ఎలా సాగించాడు, దుష్టశిక్షణ ఏ విధంగా చేశాడు అనేది ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో శ్రీమురళి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. ప్రకాష్‌రాజ్ ఓ ఉన్నత పోలీస్ అధికారిగా కనిపిస్తాడు. చేతన్ డి.సౌజా కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. బి.అజనేష్ లోక్‌నాథ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కెజిఎఫ్, సలార్ చిత్రాల స్థాయిలో ఎంతో ఎఫెక్టివ్‌గా ఉంది. అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ కథ అందించిన ‘బఫీుర’ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.