Read more!

English | Telugu

హీరో నవీన్‌ పొలిశెట్టికి అమెరికాలో రోడ్ యాక్సిడెంట్!

యువ హీరో నవీన్‌ పొలిశెట్టి(Naveen Polishetty)కి రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఆయన బైక్ మీద నుంచి జారిపడటంతో గాయాలయ్యాలట. ఈ ప్రమాదం అమెరికాలో జరిగిందని సమాచారం. నవీన్‌ బైక్ మీద వెళ్తుండగా స్కిడ్ అయ్యి కింద పడగా.. చేతికి ఫ్యాక్చర్ అయిందట. వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వినికిడి.

యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకొని.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు నవీన్‌. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నవీన్.. ఆ తర్వాత 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలతో సత్తా చాటి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు.