English | Telugu
మెన్స్ డే సందర్భంగా బాంబ్ పేల్చిన నరేష్..బ్లాక్ మెయిల్,హనీట్రాప్ జరుగుతుంది
Updated : Nov 20, 2024
బాలనటుగా కెరీర్ ని ప్రారంభించిన నరేష్(naresh)ఆ పై హీరోగా,ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులని మెప్పించడం జరిగింది.ప్రెజంట్ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారి తన సత్తా చాటుతూ బిజీ ఆర్టిస్ట్ గా మారాడు. ప్రస్తుతం రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్(game changer)లో ఒక కీలక పాత్ర పోషించడంతో పాటు అల్లరి ఫేమ్ రవిబాబు(ravi babu)దర్శకత్వంలో కూడా ఒక మూవీ చేస్తున్నాడు.
రీసెంట్ గా ఆ మూవీ సెట్స్ లో నవంబర్ 19 న మెన్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసిన నరేష్ ఆ తర్వాత మాట్లాడుతూ ఉమెన్స్ డే ని ఉమెన్స్ మాత్రమే కాకుండా మెన్స్ కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం.అదే విధంగా మెన్స్ డే ని కూడా ఉమెన్, మెన్ కలిసి చాలా ఘనంగా సెలబ్రేట్ చేసేలా అందరం మెన్స్ డే ని ముందుకు తీసుకెళ్లాలి.భారతదేశంలో మన హిందూ సంసృతిలో లక్ష్మిదేవి కి ఫైనాన్స్, సరస్వతి దేవికి ఎడ్యుకేషన్, కాళీ మాత కి లా అండ్ ఆర్డర్ ఇచ్చాం. అంతలా మహిళలకి ఇంపార్టెంట్ ఇచ్చాం.
కాలక్రమేణా ఇప్పుడు వరకట్న వేధింపులు చాలా వరకు తగ్గిపోయాయి.ఇది చాలా సంతోషం.కానీ ఒక పక్క నుంచి ఉమెన్ పై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతుండగా మగవాళ్ళు కూడా అంతే విధంగా సఫర్ అవుతున్నారు.మగవాళ్ళు పై ఈ రోజున డొమెస్టిక్ వైలెన్స్స్ ఫాల్స్ కేసు ని కొంత మంది మహిళలు పెట్టడం ఎక్కువైపోయింది.బ్లాక్ మెయిల్,హనీ ట్రాప్ వంటివి కూడా చేస్తున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే స్పార్మ్ లో మగవాళ్ళని ఉత్పత్తి చేసే వై క్రోమోజోమ్ డౌన్ అయిపోతుంది. దీంతో ఒక ఐదువందల ఏళ్ళలోనో, వెయ్యేళ్లలోనో మగ జాతి తగ్గిపోబోతుంది .కాబట్టి ప్రపంచం సుభిక్షంగా ఉండాలంటే ఆడ,మగ కలిసి ఉండాలి.మగ వాళ్ళందరూ మిమ్మల్ని బాగా చూసుకునే భార్యలని ప్రేమించండి. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ కి దూరంగా ఉండాలని చెప్పుకొచ్చాడు.