Read more!

English | Telugu

కృష్ణ.. చిరంజీవి.. ఇప్పుడు నారా రోహిత్..

 

సినిమా హిట్టయిందా లేదా అన్నది ముఖ్యం కాదు.. వరుసగా సినిమాలు చేస్తున్నామా లేదా అన్నది ముఖ్యం అన్నట్టు ఉంది ప్రస్తుతం నారా రోహిత్ ను చూస్తుంటే. ఎందుకంటే ఏడాదికి రెండు సినిమాలు తీయడానికే కష్టపడుతున్న ఈ రోజుల్లో వరుసపెట్టి సినిమాలు తీస్తూ.. అందరికి షాకిస్తున్నాడు. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది సినిమాలు ఈ సంవత్సరం రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.  నమ్మబుద్ది కావటం లేదు కదా.. ఇది నిజం.. ఇప్పటికే నారా రోహిత్ నటించిన తుంటరి సినిమా విడుదలవ్వగా మరో తొమ్మిది సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. మొత్తానికి అప్పట్లో కృష్ణ.. ఆతరువాత చిరంజీవీలు తరువాత ఇప్పుడు ఈ జనరేషన్లో నారా రోహిత్ రికార్డ్ సృష్టించనున్నాడు. మరి ఈ సినిమాల్లో ఎన్ని సినిమాలు హిట్టవుతాయో.. మరెన్ని సినిమాలు ఫట్టవుతాయో చూడాలి.

1. సావిత్రి
2. శంకర
3. పండగలా వచ్చాడు
4. అప్పట్లో ఒకడుండేవాడు
5. రాజా చేయి వేస్తే
6. ప్రొడక్షన్ నెం.1
7. కథలో రాజకుమారి
8.జోఅచ్యుతానంద