Read more!

English | Telugu

'ప్రతినిధి 2' వాయిదా.. కారణం అదేనా?...

నారా రోహిత్ ప్రధాన పాత్రలో మూర్తి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ప్రతినిధి 2'(Prathinidhi 2). వానర ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా దాదాపు ఆరేళ్ళ తర్వాత నారా రోహిత్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విడుదలకు ఇంకా 48 గంటలు కూడా సమయంలేదు. ఇలాంటి టైంలో మేకర్స్ ఊహించని షాకిచ్చారు. ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన 'ప్రతినిధి 2' వాయిదా పడిందని, కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తాజాగా మేకర్స్ తెలిపారు. అయితే సెన్సార్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యారని, అందుకే ఈ సినిమా వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది.