English | Telugu
నందమూరి వారసుడికి జైలు శిక్ష
Updated : Sep 7, 2017
చెక్‌బౌన్స్ కేసులో ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి జయకృష్ణకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ క్యాంటీన్, పార్కింగ్ లీజ్ విషయంలో నర్సింగరావు అనే వ్యక్తికి జయకృష్ణ రెండు చెక్కులు ఇచ్చారు. ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో ఆయన ఎర్రమంజిల్‌లోని మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం జయకృష్ణను దోషిగా తేలుస్తూ..ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా విధిస్తూ తుది తీర్పును వెలువరించారు. అయితే తీర్పును పై కోర్టులో సవాలు చేసుకునేందుకు గానూ శిక్ష అమలనును నెల రోజుల పాటు వాయిదా వేస్తూ జయకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది.