English | Telugu

పాపం..ఈమె ఏం అనలేదంట

తమిళ బొద్దు సుందరి నమిత ఇటీవలే ప్రముఖ నటుడు శరత్ కుమార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై నమిత స్పందిస్తూ... "నేను ఇటీవలే పాల్గొన్న కార్యక్రమంలో మీడియా వారు అడిగిన ప్రశ్నకు ... రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు, కానీ ఏ పార్టీలో చేరేది మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాను. అంతే తప్ప.. శరత్ కుమార్ గారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆయన తమిళ నటీనటుల సంఘంకు అధ్యక్షుడు. నేను కూడా అందులో ఒక సభ్యురాలిని. నేను మా అధ్యక్షుడిపై అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తాను? ఇలాంటి ప్రచారం చేయడం దయచేసి ఆపేయ్యండి" అని అన్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.