Read more!

English | Telugu

నాగచైతన్యకు ఈ అమ్మాయితో పెళ్లైపోయింది..!

ప్రేమమ్. కేరళ కుర్రాళ్లను వెర్రెత్తించిన సినిమా పేరు ఇది. ఈ మధ్యకాలంలో ఏ సినిమా చేయని మాయ ఈ సినిమా చేసింది. మళయాళంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా రిజిస్టర్ అయిన ఈ సినిమాను తెలుగులో నాగచైతన్య హీరోగా, అదే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నా ఆటోగ్రాఫ్ సినిమా టైప్ లో, ఒక కుర్రాడి టీనేజ్ లెవల్ నుంచి, పెళ్లయ్యే వరకూ అతని ప్రేమకథలు, జీవితగమనాన్ని చూపించే కథే ప్రేమమ్. మొత్తం ముగ్గురు హీరోయిన్స్ తో హీరో ప్రేమలో పడతాడు. చివరిగా లవ్ చేసిన అమ్మాయిని పెళ్లాడతాడు.

సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ లో సాయిపల్లవి ప్లేస్ లో శృతి హాసన్ ను తీసుకున్నారు. మిగిలిన రెండు పాత్రలకూ అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్లనే కంటిన్యూ చేశారు. తాజాగా మడోన్నా సెబాస్టియన్ తో చైతూ రిసెప్షన్ జరిగే సీన్ కు సంబంధించిన స్టిల్ లీకయ్యింది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఈ రిసెప్షన్ సీన్లో కీలకమైన ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. ప్రస్తుతానికి మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయిందట. ఇక కొన్ని పాటల్ని మాత్రం షూట్ చేయాల్సి ఉందని సమాచారం. చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న తెలుగు ప్రేమమ్ కూడా, మళయాళంలాగే మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నారు అక్కినేని అభిమానులు. మూవీ జూలై నెలలో రిలీజ్ కు రెడీ అవుతుందని అంచనా.