Read more!

English | Telugu

చైతూ తండ్రిగా వెంకటేశ్..

నాగచైతన్య తండ్రిగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారా..అవునంటున్నాయి సినీ వర్గాలు. మళయాళం మూవీ ' ప్రేమమ్ ' రీమేక్ అయిన మజ్నులో నాగచైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ' కార్తికేయ ' ఫేం చందు మొండేటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుంతోంది. రీసెంట్ గా విక్టరీ వెంకటేశ్ కూడా సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ సినిమాలో చైతూ తండ్రి పాత్రలో ఆయన గెస్ట్ రోల్ చేస్తున్నారని సమాచారం.

వెంకీ తో పాటు, నాగ్ కూడా స్పెషల్ అప్పియరెన్స్ లో కనిపించబోతున్నారు. చైతూతో ముగ్గురు భామలు శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ జతకడుతున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్ పేరుతో నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్, రాజేశ్ మురుగేశన్ సంయుక్తంగా సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం మజ్ను షూటింగ్ నగర శివార్లలో శరవేగంగా జరుపుకుంటోంది.