English | Telugu
ప్రియదర్శి కి హీరోయిన్ వార్నింగ్..మేము అంటే కేసు పెడతారా
Updated : Apr 18, 2024
ప్రియదర్శి పులి కొండ..పెళ్లి చూపులు దగ్గరనుంచి మొన్నటి ఓం భీం బుష్ దాకా తన నటనతో ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు.మధ్య మధ్యలో హీరోగా కూడా చేస్తు వర్సటైల్ యాక్టర్ గా తన సత్తా చాటుతున్నాడు. లేటెస్ట్ గా ఒక హీరోయిన్ ప్రియదర్శి కి వార్నింగ్ ఇచ్చిన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
రామ్ పోతినేని హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన మూవీ ఇస్మార్ట్ శంకర్. అందులో ఒక హీరోయిన్ గా చేసి కుర్రకారు మతులు పోగొట్టిన ముద్దుగుమ్మ నభ నటేష్. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా కూడా ఇస్మార్ట్ మాత్రమే ఆమెకి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆమె తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ పేటెంట్ డైలాగ్ డార్లింగ్ అనే పదాన్ని ఇమిటేడ్ చేస్తు చేసింది.ప్రభాస్ వివిధ సందర్భాల్లో పలికిన డార్లింగ్ అనే పదానికి యాక్ట్ చేస్తు వీడియో చేసింది. అది చూసిన ప్రియదర్శి సూపర్ గా ఉన్నావు డార్లింగ్ అంటు ట్వీట్ చేసాడు. మిస్టర్ మాట్లాడేముందు జాగ్రత్త. అయినా పరిచయం లేని ఆడవాళ్ళని డార్లింగ్ అనటం నేరం. సెక్షన్ 354 ప్రకారం సెక్సు వల్ హెరాస్మెంట్ కిందకి వస్తుంది. పోలీసు కేసు కూడా నమోదు అవుతుందంటూ రిప్లై ఇచ్చింది.పైగా అందుకు సంబంధించిన పోస్టర్ ని కూడా షేర్ చేసింది.
ప్రియదర్శి మళ్ళీ ఆ ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు. మనం ఒకరికొకరు తెలియదనే విషయం నాకు తెలియదు.అయినా మీరు డార్లింగ్ అనొచ్చు .మేము అనకూడదా. లైట్ తీసుకో డార్లింగ్ అంటు ట్వీట్ చేసాడు. ఇప్పడు ఈ మ్యాటర్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.