English | Telugu

మేకప్ లేకుండా తెలుగు హీరోయిన్లు

మేకప్ లేకుండా తెలుగు హీరోయిన్లు ఎలా ఉంటారని మన ప్రేక్షకులకు చాలా మందికి ఒక ఉత్సుకత ఉంటుంది. ఎందుకంటే మేకప్ వేసిన తర్వాత అప్పలమ్మ కూడా అప్పాయమ్మగారిలా కనపడుతుంది. మామూలుగా మేకప్ లో మన ముఖంలోని చాలా లోపాలను కప్పిపుచ్చే అవకాశాలున్నాయి. అలాగే మన తెలుగు సినీ హీరోయిన్లు కూడా మేకప్ లో తమ తమ ముఖాల్లో ఉన్న లోపాలను కనపడనీయకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూంటారు. లేకపోతే కొంత మంది హీరోయిన్ల ముఖాలు మాత్రమే మనం చూడగలం.

ఉదాహరణకు సీనియర్ హీరోయిన్ వాణీశ్రీ చాలా నల్లగా ఉండేది. కానీ ఆమె చాలా నల్లగా ఉంటుందని ఆమె సినిమాలు చూసే వారెవరికీ తెలియకుండా మేకప్ లో తగు జాగ్రత్తలు తీసుకునే వారు ఆవిడ. ఆమె అసలు రంగు గోరంత దీపం సినిమాలో మనం చూడవచ్చు. అలాగే అనుష్క, కాజల్ అగర్వాల్, సమంత, త్రిష, ఇలియానా తదితరులంతా మేకప్ లేకపోతే ఎలా ఉంటారో చూడాలనిపించే మా తెలుగువన్ ప్రేక్షకుల కోసం వారిలో కొంతమంది స్టిల్స్ ని మేకప్ లేకుండా అందిస్తున్నాం. చూసి ఆనందించండి.