Read more!

English | Telugu

‘మై డియర్ దొంగ’ మూవీ రివ్యూ

మూవీ : మై డియర్ దొంగ
నటీనటులు: అభినవ్ గోమటం, శాలిని కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ తదితరులు
రచన : శాలిని కొండెపూడి
ఎడిటింగ్: సాయి మురళి
మ్యూజిక్: అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ: ఎస్ఎస్ మనోజ్ 
లిరిక్స్ : సురేష్ బనిసెట్టి
నిర్మాతలు: మహేశ్వర్ రెడ్డి గోజాల
దర్శకత్వం: బిఎస్ సర్వగ్న కుమార్
ఓటీటీ : ఆహా

కథ:

సిటీలోని ఓ బార్ లో సుజాత( శాలిని కొండెపూడి) ఒక్కతే కూర్చొని తాగుతూ తనలో తానే మాట్లాడుకుంటుంది. బార్ క్లోజ్ చేసే సమయం దాకా తాగేస్తుండగా.. అందులో పనిచేసే వంశీ తనని వెళ్ళిపోమని చెప్తాడు. లేదు బాబు.. నా లవ్ స్టోరీ వినమని చెప్పగా. ‌ నాకంత టైమ్ లేదని, మీరందరు ఒకేలా ఉంటారని చెప్తాడు. ఆయితే ఎలాగోలో కన్విన్స్ చేసి తన లవ్ స్టోరీని మొదలుపెడుతుంది సుజాత. తన లైఫ్ లో హ్యాపీనెస్ లేదని ఎంతసేపు బుజ్జి, వరుణ్ ల లవ్  స్టోరీని చూడటమే అని తనెనవరు పట్టించుకోవడం లేదని.. చివరికి తను ప్రేమించే విశాల్ కూడా  తనకోసం ఏం చేయట్లేదని అనుకుంటుండగా.. అదే సమయంలో తన ఇంట్లో ఓ దొంగ( అభినవ్ గోమటం) చొరబడతాడు. ఆ తర్వాత సుజాత, దొంగల మధ్య ఏం జరిగింది? విశాల్ సుజాతని ప్రేమించాడా లేదా తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఓ అమ్మాయి బ్రేకప్ స్టోరీని చెప్పడంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. తన లవ్ స్టోరీలో దొంగ రావడం నుండి ఎలా మలుపు తిరిగిందో చెప్తూ కథ ముందుకు సాగుతుంది. ఎక్కడ ల్యాగ్ అవ్వకుండా జాగ్రత్తపడ్డారని తెలుస్తుంది.

సిమిమా నిడివి కూడా గంట నలభై నిమిషాలు కావడం మూవీకి మరింత బలంగా నిలిచింది. కథలో దొంగ(అభినవ్ గోమటం) క్యారెక్టర్ ఎంట్రీ అయినప్పటి నుండి సిమిమా ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ అలా పెరిగింది. డైలాగ్ డెలివరీతో చిన్న చిన్న పంచులతో కామెడీ చేయడం అభినవ్ గోమటంకి కొట్టిన పిండి అని మరోసారి నిరూపించాడు. సుజాత-విశాల్ ల మధ్య సాగే కొన్ని సీన్లు ఇబ్బందిగా ఉంటాయి‌.‌ అక్కడక్కడ కథనం నెమ్మదిగా సాగుతుంది. ఈ సినిమాకి కామెడీ ప్రధాన బలంగా నిలిచింది. అయితే తాగుబోతు నాన్నతో కూతురు మాట్లాడే కొన్ని సంభాషణలు ఆలోచింపజేస్తాయి. " కొంతమందికి తీసుకోవడంలో హ్యాపీనెస్ ఉంటుంది. మరికొమందికి ఇవ్వడంలో హ్యాపీనెస్ ఉంటుంది", " ఎన్నడూ.. ఎవరినీ.. ఏదీ అడిగే పొజిషన్ లో నువ్వు ఉండకు అని వాళ్ళ నాన్న సూజాతతో చెప్పే మాటలు ఆకట్టుకుంటాయి. ఒకట్రెండు కిస్ సీన్లు వదిలేస్తే ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు

బయట ప్రస్తుతం ప్రేమికులు ఎలా ఉన్నారో .. వాటకి తగ్గట్టుగానే కథని రాసుకొని వెల్ ప్రెజెంటేషన్ తో తీసారు. అయితే ఇది యువతని దృష్టిలో ఉంచుకొని తీసిన కథ. రిలేషన్ షిప్ లో‌ మ్యాజిక్ మిస్ అవ్వకూడదంటే కొన్ని చిన్న చిన్న వాటిని చేయాలని కన్విన్సింగ్ చేసే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. మై డియర్ దొంగ టైటిల్ సాంగ్ బాగుంది. క్లైమాక్స్ ముందు వచ్చే ఎమోషనల్ సాంగ్ కూడా కనెక్ట్ అవుతుంది.  అజయ్ అరసాడ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది. సాయి మురళి ఎడిటింగ్ నీట్ గా ఉంది. ఎస్ఎస్ మనోజ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

సురేష్ పాత్రలో‌ అభినవ్ గోమటం సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు. సుజాతగా శాలిని కొండెపూడి, బుజ్జిగా దివ్య శ్రీపాద‌ అభినయాన్ని ప్రదర్శించారు. నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్ బెస్ట్ సపోర్టింగ్ రోల్ చేశారు.‌ ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర‌ నటించారు.

ఫైనల్ గా : సరదాగా సాగే కామెడీ ఎంటర్ టైనర్. మస్ట్ వాచెబుల్ లవ్ డ్రామా. 

రేటింగ్ : 2.75 / 5

✍️. దాసరి మల్లేశ్