Read more!

English | Telugu

అభినవ్ గోమటం దొంగ అని చెప్తున్న అల్లు అరవింద్.. మనీ కోసం వెయిటింగ్ 

సక్సెస్‌ఫుల్ చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తు వస్తున్న నటుడు అభినవ్ గోమటం. హీరోగా కూడా లాంచ్ అయ్యాడు. ఇటీవల  మై డియర్ దొంగ అంటు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం  ఆహా లో విడుదలైన ఈ మూవీ ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. 

హీరో అభినవ్ గోమటం మాట్లాడుతూ..మా సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. అలాగే ప్రేక్షకుల  ముందుకు తీసుకెళ్తున్న మీడియాకి కూడా  థాంక్స్.  ప్రొడక్షన్, నటీనటులు, ఆహా  ఈ మూడు టీం లని  సమన్వయం చేసుకొని మూవీ  చేయడం జరిగింది.  శాలిని చాలా చక్కగా కథ రాసింది. అలాగే  చాలా కష్టపడింది కూడా .   వంశీ, శర్వాతో లు కూడా చాలా చక్కగా నటించారు. మనోజ్ చక్కని విజువల్స్ ఇచ్చాడు.ముఖ్యంగా  అల్లు అరవింద్ గారికి మా ప్రాజక్ట్ చాలా బాగా నచ్చింది. మంచి  సినిమాలో భాగం కావడం కూడా  చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. అలాగే ఈ మూవీలో హీరోయిన్  గా చేసిన శాలినీ కూడా మాట్లాడింది. పైగా మై డియర్ దొంగ స్టోరీ ని కూడా తనే అందించింది. 

మా మూవీకి  వచ్చిన రివ్యూస్, రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇంత గొప్ప రెస్పాన్స్ ని  అసలు ఊహించలేదు. ఆహ టీంకి ధన్యవాదాలు. ఇది బ్యూటీఫుల్ టీం వర్క్. పాషన్ తో ఒక కంటెంట్ ని హానెస్ట్ గా నమ్మి చేస్తే విజయం వస్తుందని చెప్పడాని  మా మూవీనే  ఒక ఉదాహరణ. ఇంత గొప్ప రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకి  ధన్యవాదాలు. దర్శకుడు కథని గొప్పగా అర్ధం చేసుకొని చాలా  గొప్పగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమా రాయడం నాలో గొప్ప ఆత్మ విశ్వాసాన్ని నింపింది. అభినవ్ కి ధన్యవాదాలు. దివ్యతో పాటు ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా గురించి మరింత మందికి చెప్పాలని మీడియాని కోరుతున్నాను. అందరికీ రికమెండ్ చేసే చిత్రమిది. అందరూ ఎంజాయ్ చేస్తారు. మీ అందరి సపోర్ట్ మరింతగా వుండాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.  

దర్శకుడు బీఎస్ సర్వాంగ కుమార్ కూడా మాట్లాడారు.  మై డియర్ దొంగ  మా అందరికీ గొప్ప అవకాశాలు తెచ్చిపెట్టింది. అభినవ్ గారు చాలా సపోర్ట్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ ఝాన్సీ గారు చాలా మంచి లుక్ తీసుకొచ్చారు. అజయ్ అర్సాడా మ్యూజిక్ తో సినిమాని ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. శాలిని మంచి రచయిత, నటి. వీళ్లందరి తో  కలిసి  మళ్ళీ వర్క్ చేయాలని ఉందని తెలిపాడు. అభినవ్,  శాలినీ తో పాటు  దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించాడు.ఆయన కూడా సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని తెలిపాడు. మూవీ  చూడని ప్రేక్షకులు తప్పకుండా చూడండి. పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి అని కోరాడు. మై డియర్ దొంగ ని ఇప్పటివరకు ఇరవై ఐదు లక్షల మంది చూసారని  ఆహా మార్కెటింగ్ హెడ్ రాజశేఖర్ తెలిపాడు. అలాగే  మై డియర్ దొంగ రిటర్న్స్ కోసం ఎదురుచుస్తున్నాం  అని తెలిపారు.ఇంకా ఈ మూవీ లో నటించిన  నిఖిల్, స్నేహాల్, వంశీ లు కూడా మూవీ విజయం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు