English | Telugu

"మిస్టర్ నోకియా" ఆడియో జనవరి తొలివారంలో

"మిస్టర్ నోకియా" ఆడియో జనవరి తొలివారంలో విడుదల కానుంది. వివరాల్లోకి వెళితే శ్రీశైలేంద్ర సినిమాస్ పతాకంపై, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్ హీరోగా, ఇషా చావ్లా హీరోయిన్ గా, అని (అనిల్ కృష్ణ) దర్శకత్వంలో, డి.యస్.రావు నిర్మిస్తున్న యాక్షన్ ప్యాక్డ్, విభిన్నప్రేమకథా చిత్రం "మిస్టర్ నోకియా". ఈ "మిస్టర్ నోకియా" చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్నందిస్తున్నారు. ఈ "మిస్టర్ నోకియా" చిత్రం ఆడియో 2012 జనవరి మొదటి వారంలో విడుదల కానుంది.

ఈ "మిస్టర్ నోకియా" చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను హీరో మంచు మనోజ్ కుమార్ స్వయంగా కంపోజ్ చేయటం విశేషం. ప్రస్తుతం ఈ "మిస్టర్ నోకియా" చిత్రంలోని ఆఖరి పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి "చందమామ, అలా మొదలైంది" ఫేం లక్ష్మీ భూపాల్ మాటలు వ్రాయటంతో పాటు ఒక పాటను కూడా వ్రాయటం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.