English | Telugu
ఆరు కోట్లు ఇచ్చిన రవితేజ, హరీష్ శంకర్..అభినందిస్తున్న ప్రజానీకం
Updated : Sep 6, 2024
మాస్ మహారాజ రవితేజ(raviteja)గత నెల అగస్ట్ 15 న మిస్టర్ బచ్చన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గబ్బర్ సింగ్ హరీష్(harish shankar)దర్శకుడు కావడంతో సినిమాపై అందరిలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి.పైగా ట్రైలర్ కూడా ఒక రేంజ్ లో ఉండటంతో సిల్వర్ స్క్రీన్ పై మిస్టర్ బచ్చన్(mr bachchan)రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.కానీ అందరి అంచనాలని తలకిందులు చేస్తు దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో రవితేజ, హరీష్ శంకర్ లు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
యాభై కోట్ల బడ్జట్ తో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ కనీసం ఎనిమిది కోట్లని కూడా రాబట్టలేదనే న్యూస్ గత కొద్దీ రోజులుగా సినీ మార్కెట్ లో చక్కర్లు కొడుతుంది. దీంతో నిర్మాత తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ నష్టాలు వచ్చాయని, రవితేజ, హరీష్ శంకర్ లు తాము తీసుకున్న రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని వెనక్కి ఇచ్చేశారనే టాక్ ఒకటి బయటకి వచ్చింది. రవితేజ నాలుగు కోట్లరూపాయలని, హరీష్ రెండు కోట్లు ఇలా మొత్తం ఆరుకోట్ల వెనక్కి ఇచ్చాడని అంటున్నారు. ఈ విషయం అధికారకంగా బయటకి రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఒక రేంజ్ లోనే వైరల్ అవుతుంది.అదే విధంగా ఈ న్యూస్ చూసినా చాలా మంది సినీ అభిమానులు రవితేజ అండ్ హరీష్ ని అభినందిస్తూ మెసేజెస్ లు కూడా చేస్తున్నారు.
మిస్టర్ బచ్చన్ ప్రొడ్యూసర్ పీపుల్స్ ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ ఇటీవల చాలా ఇంటర్వూస్ లో మిస్టర్ బచ్చన్ వల్ల బాగా లాస్ అయ్యాయని కూడా చెప్పాడు. రవితేజ సరసన నూతన కథానాయిక భాగ్యశ్రీ బోర్సే జత కట్టగా జగపతి బాబు, సచిన్ ఖేడ్ కర్, అభిమన్యు సింగ్, శుభలేఖ సుధాకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.