Read more!

English | Telugu

మొరాకో లో బాలయ్య అండ్ కో ఫోటోలు..!

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి, ప్రస్తుతం మొరాకోలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏడు రోజుల షూటింగ్ ను కంప్లీట్ చేసిన మూవీ టీం, చాలా కష్టపడుతున్నారంటూ క్రిష్ తన ఫేస్ బుక్ లో షేర్ చేసుకున్నారు. యూనిట్ అంతా కలిసి భోజనం చేస్తున్న ఫోటోలను, మొరాకో ఇండియన్ ఫుడ్ ను కలిపి తింటుంటే చాలా బాగుంది అన్న స్టాటస్ ను తన ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేశారు క్రిష్.

బాలయ్య కూడా అందరితో కలుపుగోలుగా భోజనం చేస్తుండటం ఈ ఫోటోల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం సినిమాలో చాలా కీలకమైన వార్ సీక్వెన్సెస్ ను మొరాకోలో తెరకెక్కిస్తున్నారు. బాలయ్య అభిమానులతో పాటు, తెలుగువారందరికీ గర్వకారణంగా సినిమాను తెరకెక్కిస్తున్నామని నిర్మాతలు చెబుతున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు శాతకర్ణి సినిమాను నిర్మిస్తున్నారు. లెజండ్ లాంటి మ్యూజికల్ తర్వాత దేవీశ్రీ ప్రసాద్ బాలయ్యకు సంగీతం అందిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.