English | Telugu

మోహన్ బాబు పై విద్యార్థుల తిరుగుబాటు.. లోకేష్ కి కంప్లైంట్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(mohan babu)చాలా సంవత్సరాల నుంచే విద్యాసంస్థలు నడుపుతున్న విషయం అందరకి తెలిసిందే. ఇప్పుడు ఈ విద్యాసంస్థలపై అందులో చదువుతున్న విద్యార్థులు తమ తల్లి తండ్రులతో కలిసి పేరెంట్స్ అసోసియేషన్ కి  ఫిర్యాదు చెయ్యడం సంచలనం సృష్టిస్తుంది.  

తిరుపతిలో ఉన్న  శ్రీ విద్యానికేతన్ 2002 నుంచి  మోహన్ బాబు యూనివర్సటీ(mbu)పేరుతో కొనసాగుతుంది. తొమ్మిది సంస్థల సమూహారంగా ఏర్పడిన ఈ యూనివర్సిటీ కి మోహన్ బాబు నే వైస్ ఛాన్సలర్. ఇంజనీరింగ్, పిజీ,అగ్రికల్చర్, పారామెడికల్ ఇలా ఎన్నో  విభాగాల్లో చాలా మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. నాణ్యత లేని చదువుని  బోధించడంతో పాటుగా రకరకాల కారణాలు చెప్పి ఎక్కువ ఫీజులు  వసూలు చేస్తున్నారని, అలాగే  బస్సు ఫీజు కింద కూడా ఎక్కువగా వసూలు చేస్తున్నారు.పైగా ఎక్కువ మంది ఉండటం వలన బస్సు లో సీట్ లు లేకపోయినా నలబై ఐదు నిమిషాలు పాటు  నుంచోనే ఉంటున్నాం. అదేమని అడిగితే బౌన్సర్ల తో దాడి చేయిస్తున్నారు. పైగా డే స్కాలర్స్ కూడా ఖచ్చితంగా మెస్ లోనే భోజనం చెయ్యాలి. అది కూడా రెండు గంటల నుంచి మూడుగంటల మధ్య మెస్ ఓపెన్ ఉంటుంది. లక్షలకి లక్షలు ఫీజులు కట్టాం. ఆ ఫీజుకి  న్యాయం కూడా జరగడం లేదని  స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కంప్లైంట్ చేసారు.

  అలాగే  స్టాఫ్ కి సరైన టైమ్ కి జీతాలు కూడా  ఇవ్వటంలేదనే విషయాన్నీ కూడా కంప్లైంట్ లో పొందుపరిచారు. పేరెంట్స్ అసోసియేషన్ అయితే  ఆల్ ఇండియా టెక్నీకల్ కౌన్సిల్ కి, అదే విధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కంప్లైంట్ చేసింది. మరి ఈ వివాదం ఎక్కడకి దారి తీస్తుందో చూడాలి.