English | Telugu

‘మోడ్రన్‌ మాస్టర్స్‌’.. మనకు తెలిసింది కొండంత.. ఇందులో చూపించింది గోరంత!

సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిభ గురించి, ఆయన సినిమాలు సాధించిన విజయాల గురించి, ప్రపంచవ్యాప్తంగా అతనికి ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి పదే పదే చెప్పడం చర్వితచర్వణమే అవుతుంది. ఎందుకంటే అతని గురించి, అతని సినిమాలు సాధించిన విజయాల గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి అవుతుంది. అయితే అతని వ్యక్తిగత జీవితం, సినిమా ప్రస్థానం వంటి విషయాల గురించి తెలియనివారు ఎంతో మంది ఉంటారు. వారి కోసమే ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించారు దర్శకుడు రాఘవ్‌ ఖన్నా. దీన్ని సమీర్‌ నాయర్‌, దీపక్‌ సెగల్‌ నిర్మించారు.

సాధారణంగా సినీ ప్రముఖుల గురించి హాలీవుడ్‌లోనే ఎక్కువగా డాక్యుమెంటరీలు రూపొందిస్తుంటారు. ఇప్పుడు ఒక తెలుగు దర్శకుడి గురించి ఈ తరహా చిత్రాన్ని నిర్మించడం విశేషంగానే చెప్పుకోవాలి. అసలు ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ డాక్యుమెంటరీలో పొందుపరిచిన అంశాలేమిటి, వాటిని ఏ విధంగా ప్రజెంట్‌ చేశారు, రాజమౌళి గురించి మనకు తెలియని విషయాలు ఏమిటి?, అతని గురించి సినీ ప్రముఖులు ఏమన్నారు? ‘స్టూడెంట్‌ నెం.1’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన రాజమౌళి అంతకుముందు ఏం చేసేవారు? వంటి విషయాలను ఇందులో ప్రస్తావించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ డాక్యుమెంటరీని తెలుగు, తమిళ్‌, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమోలు పలు భాషల్లో రిలీజ్‌ చెయ్యడం ద్వారా ముందు నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించారు.

74 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి వ్యక్తిగత జీవితం, ఆయన సినిమా ప్రయాణం, తెరవెనుక రాజమౌళి ఎలా ఉంటాడు అనే విషయాలను ఇందులో పొందుపరిచారు. అంతేకాదు, దర్శకుడుగా ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన చేసిన కృషి ఏమిటి?, అతని సక్సెస్‌ ఫార్ములా ఎలా ఉంటుంది వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళిపై కుటుంబ సభ్యులతోపాటు టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలను పొందుపరిచారు. అంతేకాదు, ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రానా దగ్గబాటి, ఎం.ఎం.కీరవాణి, రమా రాజమౌళి, ఎస్‌.ఎస్‌.కార్తికేయ, వి.విజయేంద్రప్రసాద్‌, శోబు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు వంటి సినీ ప్రముఖులు రాజమౌళితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. టెర్మినేటర్‌ 2, టైటానిక్‌, అవతార్‌ సిరీస్‌ వంటి విజువల్‌ వండర్స్‌ని క్రియేట్‌ చేసిన జేమ్స్‌ కేమరాన్‌ వంటి హాలీవుడ్‌ దర్శకుడు రాజమౌళిని అప్రిషియేట్‌ చేసి మాట్లాడడం తెలుగువారికి గర్వకారణంగా అనిపిస్తుంది. అలాగే బాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న కరణ్‌ జోహర్‌ కూడా రాజమౌళిని ప్రశంసించడం విశేషం.

సినిమా ప్రేమికులందరికీ రాజమౌళికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసు. అయితే అందరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు, ఇప్పటివరకు అందుబాటులో లేని రాజమౌళి పాత ఫొటోలు ఈ డాక్యుమెంటరీలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సినిమాల్లోకి రాకముందు రాజమౌళి టెలివిజన్‌ రంగంలో పనిచేయడం, కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ‘శాంతినివాసం’ సీరియల్‌కు దర్శకత్వం వహించడం వంటి అంశాలను వివరించారు. అంతేకాదు ‘పిల్లనగ్రోవి’ అనే చిత్రంలో రాజమౌళి బాల నటుడిగా నటించారని, ‘అర్థాంగి’ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారనే విషయాలను ఈ డాక్యుమెంటరీ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు.

‘బాహుబలి’ చిత్రానికి రిలీజ్‌ రోజు వచ్చిన డివైడ్‌ టాక్‌, కట్టప్ప క్యారెక్టర్‌ను తక్కువగా చూపించారనే విమర్శలపై రాజమౌళి స్పందించారు. రాజమౌళి స్టోరీ ఐడియాలు, తన సినిమాల్లో హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే విధానం, హీరో పాత్రకి తగ్గట్టుగా విలన్‌ క్యారెక్టర్‌ను క్రియేట్‌ చేసే విధానం, యాక్షన్‌, ఎమోషన్స్‌, విజువల్స్‌ ఎఫెక్ట్స్‌ వంటి పలు అంశాల మీద రాజమౌళికి ఉన్న విజన్‌ గురించి ఈ డాక్యుమెంటరీలో మనం తెలుసుకోవచ్చు. ఎ ఫిల్మ్‌ బై ఎస్‌.ఎస్‌. రాజమౌళి అనే ట్యాగ్‌లైన్‌ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది రాజమౌళి తెలిపారు. ఇక ఈ డాక్యుమెంటరీలో ఆకట్టుకోని అంశాలేమిటంటే.. ఇందులో చూపించిన చాలా అంశాలు అందరికీ తెలిసినవే. తెలియని విశేషాలు మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. అందర్నీ ఇది కొంత నిరాశపరిచే విషయమనే చెప్పాలి. ఓవరాల్‌గా ఈ వీడియో చూసిన తర్వాత అందరికీ కలిగే అభిప్రాయం.. మనకు తెలిసింది కొండంత.. ఇందులో చూపించింది గోరంత అనే ఫీలింగ్‌ మాత్రం మన తెలుగువారికి తప్పకుండా కలుగుతుంది. అయితే ఇతర భాషల్లో చూసేవారికి మాత్రం ఈ డాక్యుమెంటరీ కొత్త అనుభూతిని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.