Read more!

English | Telugu

మతిస్థిమితం కోల్పోయిన ముంబై హీరోయిన్..!

రంగుల లోకం ఆకాశానికి తీసుకెళ్తుంది. పాతాళానికి తొక్కేస్తుంది. కేవలం ఒక్క సినిమాతో కళ్లు మూసి తెరిచేలోపు, ఎంతో మంది జీవితాలు రోడ్డున పడిపోతుంటాయి. మరికొందరు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు. సినిమాల్లో ఏదొకటి సాధించాలని ప్రతీరోజూ హైదరాబాద్ ట్రైన్ ఎక్కేవాళ్లు, ముంబై ట్రైన్ ఎక్కేవాళ్లు కోకొల్లలు. అలాగే ముంబై బయలుదేరింది మిథాలీ శర్మ. పాతికేళ్ల ఈ ఢిల్లీ అమ్మాయికి హీరోయిన్ గా వెలుగు వెలగాలని కోరిక. సినిమాలంటే పిచ్చి. అందుకోసం ముంబై చేరుకుంది. ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక భోజ్ పురి సినిమాలో అవకాశం సంపాదించుకోగలిగింది. ఆ సినిమా ఆడలేదు. తర్వాత ఆమెకు ఇంకే అవకాశాలు రాలేదు. తిరిగి ఇంటికెళ్లడానికి ఆమెకు మనసొప్పలేదు. దీంతో ముంబైలోనే కొన్నాళ్ల పాటు అవకాశాల కోసం ప్రయత్నించి ప్రయత్నించి చివరకు ఆకలికి తాళలేక మతిస్థిమితం కోల్పోయింది. ముంబైలోపి లోకండ్ వాలా వీధుల్లో  వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్న ఆమెను స్థానిక పోలీసులు గుర్తించి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. మిథాలీని తన స్వస్థలానికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఆమె కోలుకోవడానికి, తిరిగి మామూలు మనిషి కావడానికి పది రోజులు పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అవకాశాలు లేకపోతే, రంగుల ప్రపంచం ఎంత దుర్భరంగా మారుతుందో తెలియజెప్పడానికి మరో ఉదాహరణ మిథాలీ శర్మ గాథ.