Read more!

English | Telugu

డైరెక్టర్ హరీష్ శంకర్ రామ్ లల్లా  వీడియో వైరల్  

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య లో శ్రీరాముడు కొలువుతీరి ఉన్నాడు. మాస్ మహారాజా రవితేజ న్యూ మూవీ మిస్టర్ బచ్చన్. డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. అయోధ్యకి, మిస్టర్ బచ్చన్ కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా! సంబంధం ఉంది. 

మిస్టర్ బచ్చన్ షూటింగ్ నెల రోజుల నుంచి ఉత్తర్ ప్రదేశ్ క్యాప్టిల్ లక్నోలోని  పలు లొకేషన్స్ లో జరుగుతుంది.ఒక తెలుగు సినిమా అంత లాంగ్ షెడ్యూల్ ని యుపి లో జరుపుకోవడం ఇదే మొదటి సారి. రీసెంట్ గా చిత్ర యూనిట్ షూటింగ్ ని ముగించుకుంది.ఈ సందర్భంగా యూనిట్ అయోధ్యలోని రామ్ లల్లా ని దర్శించుకుంది. అందులో భాగంగా హరీష్ శంకర్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఆ వీడియో చూసిన ఎవరికైనా హరీష్ కి రాముడు అంటే ఎంత భక్తి ఉందో  అర్ధం అవుతుంది. గుండెల నిండా రామ్ లల్లా ని నింపుకొని కృతజ్ఞతతో స్వామికి  నమస్కరించాడు.  మిస్టర్ బచ్చన్  విజయం సాధించాలని కూడా  వేడుకున్నాడు.

రవితేజ, హరీష్ కాంబోలో వచ్చిన మిరపకాయ్  ఘన విజయం సాధించిన నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా రవితేజ సరసన  భాగ్యశ్రీ బోర్సే కథానాయికి గా చేస్తుంది. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందు రావడానికి శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది