Read more!

English | Telugu

మెగాస్టార్ దంపతుల ఆహ్వాన పత్రిక ఇదేనండి

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహం ఈ నెల 28న బెంగళూరులో జరగబోతోంది. పెళ్లికి సంబంధించి ప్రతీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు మెగా కుటుంబసభ్యులు. పెళ్లి ఎక్కడ చెయ్యాలా అన్నదానిపై కూడా చాలానే తర్జనభర్జనలు జరిగాయి. చరణ్ అయితే వేసవి కాబట్టి నార్త్ ఇండియాలో పెళ్లి పెట్టుకుంటే బెటరని అక్కడ చాలా ప్రదేశాలు చూశాడు. చివరికి కూల్ సిటీగా పేరున్న బెంగుళూర్ లో, తమ ఫామ్ హౌస్ అయితేనే బెస్ట్ అని ఫిక్సయ్యారట మెగా కుటుంబం. పెళ్లికి కేవలం రెండు వైపులా కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నారు. రిసెప్షన్ ను మాత్రం హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేయనున్నారు. దానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డు ఇది.

పవన్ తో పాటు, మొత్తం కొణిదెల కుటుంబసభ్యులు, మెగా హీరోలందరూ కూడా పెళ్లి సమయానికి తమ పనులన్నీ వాయిదా వేసుకున్నారు. పెళ్లి అవ్వగానే పవన్ యూరప్ బయలుదేరతారని సమాచారం. కాబోయే వరుడు కళ్యాణ్, శ్రీజకు చిన్ననాటి స్నేహితుడు. కళ్యాణ్ కు హైదరాబాద్ లో జ్యూయెలరీ బిజినెస్ ఉంది. ఇన్విటేషన్ కార్డుకు టాప్ సెంటర్లో కొణిదెల లోగో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.