Read more!

English | Telugu

మెగాస్టార్ చిరంజీవి ' కత్తిలాంటోడు ' బాలేదట..!

కూతురి పెళ్లి తర్వాత రిలాక్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి కత్తి రీమేక్ పై దృష్టి సారించారు. అందులో భాగంగా, సినిమాకు టైటిల్ ఏం పెడదాం అన్న దానిపైనే చర్చ నడుస్తోంది. తమిళ్ లో ఉన్న కత్తి టైటిల్ నే కన్ఫామ్ చేద్దామంటే, ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఆ టైటిల్ ను వాడేశాడు. దాంతో కత్తిలాంటోడు ఎలా ఉంటుంది అంటూ చిరు సన్నిహితుల దగ్గర టైటిల్ లీక్ చేశారు. ఇప్పుడు దీనిపై మెగా ఫ్యాన్స్ ఫీడ్ బ్యాక్ నెగటివ్ గా వస్తోందట. స్పీడున్నోడు, సరైనోడు, పోలీసోడు లాంటి టైటిల్స్ అన్నీ కుర్ర బ్యాచ్ హీరోలు పెట్టుకుంటున్నారు. కానీ షష్టిపూర్తి చేసుకున్న మెగా స్టార్ మెగా ఇమేజ్ కు ఈ టైటిల్ ఎందుకో సెట్ అయినట్టు అనిపించట్లేదంటూ మెగాఫ్యాన్స్ చిరుకు చెబుతున్నారట. దాంతో ఈ టైటిల్ పై మెగాస్టార్ మళ్లీ ఆలోచనలో పడ్డారని సమాచారం. స్టాలిన్, ఠాగూర్ లాగా ఏదైనా కాస్త హెవీ టైటిల్ ను ఎంచుకుందామని మూవీ టీం భావిస్తున్నారట. మరి కొత్త టైటిల్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే, మరి కొంత కాలం చూడాల్సిందే..