Read more!

English | Telugu

మెగా ఫ్యామిలీ మ్యారేజ్ కు ముస్తాబైంది

మెగా ఫ్యామిలీలో త్వరలోనే శ్రీజ పెళ్లిబాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. తమ వ్యక్తిగత వ్యవహారంగా ఈ పెళ్లిని చాలా ప్రైవసీ మధ్యలో జరుపుతున్నారు మెగాస్టార్. అందుకే పెద్దగా శ్రీజ పెళ్లి గురించిన ఫోటోలు బయటికి రాలేదు. తాజాగా వరుణ్ తన ఇన్ స్టాగ్రామ్ లో శ్రీజతో సెల్ఫీ దిగి పెట్టాడు. బ్యూటిఫుల్ బ్రైడ్, సిస్టర్, వెడ్డింగ్ అని హ్యాష్ ట్యాగ్స్ తో పాటు లెట్ ది సెలబ్రేషన్స్ బిగిన్ అని ట్వీట్ చేశాడు..

పెళ్లికూతురిగా శ్రీజ పుత్తడి బొమ్మలా ఉంది. బెంగళూరులోని చిరు ఫ్యామిలీ ఫామ్ హౌస్ లో 28 వ తారీఖున సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరగబోతోంది. ఆ తర్వాత రెండు రోజులకు హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ లో రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. రిసెప్షన్ కు అతిరథ మహారథుల్ని ఆహ్వానించింది కొణిదెల కుటుంబం. వరుణ్ ట్వీట్ బట్టి, ఆల్రెడీ మొత్తం మెగా కుటుంబమంతా శ్రీజ పెళ్లి కోసం ఒకేచోట చేరారు. అల్లు హీరోలు, మెగా హీరోలు అందరూ తమ షూటింగ్స్ ను పక్కన పెట్టి, పూర్తిగా పెళ్లి సందడిలో సంబరాలు చేసుకోబోతున్నారు. పవన్ కూడా త్వరలోనే ఈ సంబరాల్లో జాయిన్ అవుతారని సమాచారం. శ్రీనువైట్ల సినిమా కోసం అని ప్రచారం జరిగిన వరుణ్ గడ్డం లుక్, ఇప్పుడు క్లీన్ షేవ్ తో పూర్తిగా ముకుంద స్టైల్లోకి మారిపోవడం విశేషం.