English | Telugu

'మాస్టర్ పీస్' వెబ్ సిరీస్ రివ్యూ

వెబ్ సిరీస్: మాస్టర్ పీస్
నటీనటులు: నిత్య మీనన్, షరాఫ్, రెంజి పనికర్, మాలా పార్వతి, అశోకన్, శాంతి కృష్ణ తదితరులు
రచన: ప్రవీణ్ ఎస్
ఎడిటింగ్: రియాజ్ కె బదర్
సినిమాటోగ్రఫీ: అస్లామ్ కె పురాయిల్
మ్యూజిక్: బిజిబల్
నిర్మాతలు: మాథ్యూ జార్జ్
దర్శకత్వం: శ్రీజిత్

ప్రైమ్ వీడియోలో 'కుమారి శ్రీమతి' వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న నిత్య మీనన్.. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'మాస్టర్ పీస్' వెబ్ సిరీస్ తో మనముందుకు వచ్చింది. మరి ఈ కథేంటో ఒకసారి చూసేద్దాం...

కథ:
రియా(నిత్యా మీనన్), బినోయ్(షరఫ్ యు డీన్) భార్యభర్తలు. సిటీలోని ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తుంటారు. వారికి పెళ్లి జరిగి నాలుగు సంవత్సరాలు అయినా పిల్లలు ఉండరు. అయితే ఒకరోజు బినోయ్ ని రియా కత్తితో దాడి చేస్తుంది. అది తెలుసుకొని రియా వాళ్ళ అమ్మనాన్నలు, బినోయ్ వాళ్ళ అమ్మనాన్నలు కలిసి రియా, బినోయ్ ల కాపురం చక్కదిద్దడానికి వస్తారు. ఇలా అనుకోకుండా వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు రియా, బొనోయ్ ల సమస్యని పరిష్కరించారా? లేక వారికి అదనపు సమస్యలు తెచ్చిపెట్టారా? అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:
భర్త బినోయ్ మీదకి బీర్ బాటిల్ విసేరిసే షాట్ తో డైరెక్టర్ శ్రీజిత్ కథని ఎత్తుకున్న తీరు బాగుంది. అయితే ఆ తర్వాతే కథలో ఎక్కడ ఒక ఇంటెన్స్ లేకుండా పోయింది. మొదటి ఎపిసోడ్‌లోనే స్లో స్క్రీన్ ప్లే తో విసుగుతెప్పించాడు. రియా, బినోయ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చాక కథ వారి చుట్టూనే తిరుగుతుంటుంది. వాళ్ళని కలిపే బాధ్యతలకంటే కూడా కోడలి మీద అత్త పెత్తనం చెలాయించాలనుకునే ధోరణిలో బినోయ్ వాళ్ళ అమ్మ రియాని మాటలతో ఆడుకుంటుంది.

బినోయ్, రియాల మధ్య జరిగే గొడవలు ప్రతీ భార్యభర్తల మధ్య కామన్ గా ఉండేవే అనిపిస్తుంది. ఈ గొడవలకు అదనంగా బినోయ్ వాళ్ళ ఫ్రెండ్ మరొక అమ్మాయి అప్పుని తీసుకరావడం, తను వేరే రిలీజియన్ అవడంతో కథలో కాంప్లెక్సిటి మరింత పెరుగుతుంది. ఆ సమస్య మరింత ఇబ్బంది పెడుతుంది. అయితే కథ మొదలైన నుండి వీరి మధ్య అసలు సమస్యేంటనే విషయం ప్రేక్షకులకి అర్థం కాదు. ఎందుకంటే ఆ సమస్యేంటో చివరిదైన ఐదవ ఎపిసోడ్‌లో చూపిస్తాడు డైరెక్టర్ శ్రీజిత్.

ఒక అపార్ట్ మెంట్ లో జరిగే కథని మూడు గంటల నిడివితో ఎపిసోడ్ ల వైజ్ గా వదిలాడు డైరెక్టర్ శ్రీజిత్. ఎందుకింత నిడివి అర్థం కాదు. ఈ కథకి నిడివి సరిగ్గా గంట కూడా ఎక్కవేనని చివరి ఎపిసోడ్ వరకు చూస్తే గానీ తెలియదు‌. ఈ సిరీస్ లో ఒక రెండు ఎపిసోడ్ లు చూస్తే చాలు ఇది 'మాస్టర్ పీస్' కాదు.. చూసిన వాళ్ళు 'రెస్ట్ ఇన్ పీస్' అని తెలిసిపోతుంది. నిజం చెప్పాలంటే ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అనిపించలేదు. ఎలాగు ఒకటే ఇంట్లో షూటింగ్ ఎలాగోలా చేసేసి ఓటిటికి అమ్మేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయన్నట్టు తీసి ప్రేక్షకుల మొహాన పడేశారు. ఇదేదో కొత్త సిరీస్, అందులోను నిత్యమీనన్ ఉంది కదా అని చూస్తే పీస్ లు పీస్ లుగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

మొదటి ఎపిసోడ్ 'ఓ మై డాగ్'.. ఇది చూస్తున్నంతసేపు ఇదేనా కథ అనిపిస్తుంది. ఏ మాత్రం ఎంగేజింగ్ గా అనిపించదు. రెండవ ఎపిసోడ్ ' ఓమ్ శాంతి హోమ్'.. ఇది చూసాక ప్రేక్షకుడికి ఒకటే ఆలోచన వస్తుంది. ఇంకా అవ్వలేదా? ఇంకా మూడు ఎపిసోడ్ లు ఎలా చూడాలి రా బాబు అనిపిస్తుంది. మధ్య మధ్యలో విచిత్రమైన క్యారెక్టర్లు తీసుకొచ్చి అసలు ఎంటర్టైన్మెంట్ లేకుండా చేసేశారు. మూడవ ఎపిసోడ్: 'హ్యాపీ హవర్స్'.. ఇక ఈ ఎపిసోడ్ ఎందుకు తీసారో తీసినవాళ్ళకే తెలియాలి. నాల్గవ ఎపిసోడ్: 'లాస్ట్ సప్పర్'.. ఏదో ఒకటి లాగాలని ల్యాగ్ చేసి పడేశారు. ఇక మీ కర్మ చూసుకోండి అన్నట్టుగా లాగారు. ఎంతలా అంటే చూసే ప్రేక్షకుడికి కన్నీళ్ళని బయటకు రావాలి అనేంతలా లాగారనిపిస్తుంది. ఇక చివరి ఎపిసోడ్ 'సాంగ్ ఆఫ్ సాంగ్స్'.. ఈ ఎపిసోడ్ చూసాక ఇంతమంచి కాన్సెప్ట్ ని ఎమోషనల్ గా వాడుకోకుండా అనవసరంగా ల్యాగ్ చేసి చిరాకు తెప్పించారనిపిస్తుంది. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. అవి ఉంటే ఇక ఈ సిరీస్ చూడటం కూడా అనవసరమనిపించేదేమో. అస్లామ్ కె పురాయిల్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. బిజిబల్ మ్యూజిక్ కుదరలేదు. రియాజ్ కె బదర్ ఎడిటింగ్ ఒకే. చాలా సీన్లకి కత్తెర వేయోచ్చు. ప్రవీణ్ ఎస్ రాసిన కథని శ్రీజిత్ సరిగ్గా తీయలేకపోయాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటులు పనితీరు:
రియా పాత్రలో నిత్యా మీనన్ ఆకట్టుకుంది. బినోయ్ పాత్రలో షరఫ్ యు డీన్ బాగా నటించాడు. ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర బాగా నటించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:
ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవని మూడు గంటలు ఓపికతో చూడాలనుకునేవారికి మాత్రమే ఇది 'మాస్టర్ పీస్'. ఒక కొత్త కథని చూడాలని అనుకునేవారు చూడకపోవడమే బెటర్.

రేటింగ్: 2/5

✍🏻.దాసరి మల్లేశ్

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.