English | Telugu

ట్రైలర్‌తో అల్లాడించిన రవితేజ.. ‘మాస్‌ జాతర’కు మాస్‌ మహారాజ్‌ రెడీ!

- జాన్‌ గ్రీషమ్‌ నవల్స్‌ అంటే ప్రాణం
- మాస్‌ మహరాజ్‌ వార్‌ జోన్‌
- ప్రభాస్‌కి పోటీగా రవితేజ


మాస్‌ ఆడియన్స్‌ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ‘మాస్‌ జాతర’ ఈ వారం థియేటర్‌లో సందడి చేయబోతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కిన ‘మాస్‌ జాతర’ థియేటర్స్‌లో మాస్‌ జాతర చేయబోతోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందించారు.


ఈ సినిమాలో రైల్వే పోలీస్‌గా రవితేజ కనిపిస్తారు. లక్ష్మణ్‌ భేరి పాత్రలో తన ఒరిజినల్‌ మాస్‌ని చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో నవీన్‌ చంద్ర విలన్‌గా నటించాడు. విడుదలైన ట్రైలర్‌ అంతా యాక్షన్‌ సీన్స్‌తో నిండిపోయింది. విజువల్‌గా, యాక్షన్‌ సీన్స్‌ పరంగా, డైలాగ్స్‌ పరంగా కొత్తగా అనిపించకపోయినా ఫుల్‌ మూవీలోని కంటెంట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ‘జాన్‌ గ్రీషమ్‌ నవల్స్‌ అంటే మీకు ఇష్టమా? అని హీరోయిన్‌ అడిగిన ప్రశ్నకు ‘ప్రాణం’ అంటూ ‘వెంకీ’ సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్‌ని రిపీట్‌ చేశారు. ఇటీవలి కాలంలో సరైన హిట్‌ లేని రవితేజకు ఈ సినిమా తప్పకుండా విజయాన్ని అందిస్తుందని ట్రైలర్‌లో కనిపించిన మాస్‌ ఎపిసోడ్స్‌ ప్రూవ్‌ చేస్తున్నాయి.


‘రైల్వేస్‌లో నార్త్‌ జోన్‌, ఈస్ట్‌ జోన్‌, సౌత్‌ జోన్‌, వెస్ట్‌ జోన్‌ ఉంటాయి. నేను వచ్చినాక ఒకటే జోన్‌.. వార్‌ జోన్‌’ అనే డైలాగ్‌తో ఫైనల్‌ టచ్‌ ఇచ్చిన రవితేజ.. మరోసారి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని సూపర్‌ డూపర్‌ అనే సాంగ్‌ మాస్‌ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. అక్టోబర్‌ 31న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అదే రోజు ప్రభాస్‌, రాజమౌళిల ‘బాహుబలి ది ఎపిక్‌’ను రిలీజ్‌ చేస్తున్నారు. ఆ సినిమాకు పోటీగా థియేటర్లలోకి రాబోతోంది ‘మాస్‌ జాతర’.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.