English | Telugu
Manvat Murders Review: మాన్వత్ మర్డర్స్ వెబ్ సిరీస్ రివ్యూ!
Updated : Oct 6, 2024
వెబ్ సిరీస్ : మాన్వత్ మర్డర్స్
నటీనటులు: అశుతోష్ గోవారికర్, సాయి తమన్కర్, మకరంద్ అనస్పురె, సోనాలి కులకర్ణి తదితరులు
ఎడిటింగ్: ఫైజల్
సినిమాటోగ్రఫీ: సత్యజిత్ శోభ, శ్రీరామ్
మ్యూజిక్: సాకేత్ కనిత్కర్
నిర్మాతలు : మహేశ్ కొఠారె, అద్దినాథ్
దర్శకత్వం: ఆశిష్ అవినాష్
ఓటీటీ: సోని లివ్
కథ:
మహారాష్ట్రలోని 'మాన్వత్' గ్రామం. అక్కడ ఎనిమది నెలల్లో ఏడు హత్యలు జరుగుతాయి. చనిపోయిన వాళ్లంతా ఆడపిల్లలు, మహిళలు. ఎవరు, ఎందుకు చంపుతున్నారనేది ఎవరికీ అర్థం కాదు. దాంతో సాయంత్రం అయితే బయటికి వెళ్లడానికి మహిళలు భయపడిపోతుంటారు. దాంతో ఆ ఊరి సమీపంలోని పోలీసులు.. నకిలీ హంతకులను తీసుకొచ్చి కేసు క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక ఇది అనేక విమర్శలకు దారితీస్తుంది. దాంతో స్పెషల్ ఆఫీసర్ గా ఆ ఊరికి రమాకాంత్ కులకర్ణి (అశుతోష్ గోవారికర్) వస్తాడు. అదే ఊళ్ళో బాగా డబ్బున్న వాళ్ళుగా ఉత్తమ్ రావు - శ్రీరంగం ఉంటారు. ఇక ఈ వరుస హత్యల వెనక 'కాజూ' అనే క్షుద్ర మాంత్రికుడి పేరు తెరపైకి వస్తుంది. దాంతో అతణ్ణి పట్టుకోవడానికి కులకర్ణి టీమ్ వెళ్తుంది. ఇక అదే సమయంలో గణపతి పేరు బయటకి వస్తుంది. కులకర్ణి టీమ్ ఏం చేసింది? ఆ ఏడు హత్యలు ఎవరు ఎందుకు చేస్తారు? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
మాన్వత్ గ్రామంలో జరిగిన వరుస హత్యలు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. దానిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇండియన్ షెర్ లాక్ హోమ్ అని పిలవబడే రామాకాంత్ కలకర్ణిని రంగంలోకి దింపింది గవర్నమెంట్. 1970లలో మహారాష్ట్రలో జరిగిన హత్యల ఆధారంగా రూపొందించిన వెబ్ సిరీస్ ఇది.
ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, సూపర్ ట్విస్ట్ లతో పరుగెత్తే ఈ సిరీస్ ఆడియన్స్ చివరి వరకు కూర్చునేలా చేస్తుంది. ఇందులోని ప్రతీ పాత్రకి ఓ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక్కో పాత్ర గురించి దర్శకుడు పకడ్బందీగా రాసుకున్నాడు. అయితే ఒక్క రొమాంటిక్ సీన్, రక్తపాతం కాస్త ఎక్కువగా చూపించాడుమ కానీ అది ఈ సిరీస్ కి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లు ఉంటాయి. ప్రతీ ఎపిసోడ్ నెక్స్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటిని పెంచేస్తాయి. అయితే ఆరు, ఏడు ఎపిసోడ్ లో కాస్త సమయం తీసుకున్నాడు దర్శకుడు కానీ అది ఇన్వెస్టిగేషన్ లో కీలకంగా మారింది.
సిరీస్ చివరి వరకు విలన్ ఎవరో అర్థం కాదు.. ఎందుకంటే కథ వెనుక కథ అన్నట్టుగా స్క్రీన్ ప్లే సాగుతుంది. చివరి ఎపిసోడ్ లో రివీల్ చేసే ట్విస్ట్ లకి ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు. ఇది క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికి.. దర్శకుడు ఈ సిరీస్ ను సస్పెన్స్ తో ముందుకు తీసుకుని వెళ్తూ డ్రామాను నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. సత్యజిత్ శోభ - శ్రీరామ్ ఫొటోగ్రఫీ, సాకేత్ కనిత్కర్ నేపథ్య సంగీతం మెప్పిస్తాయి. ఫైజల్ ఎడిటింగ్ బాగుంది. ఆ సమయంలో కాస్త ఓపిక పడితే, క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లని ఇష్టపడే వారి వాచ్ లిస్ట్ లో ఈ మాన్వత్ మర్డర్స్ (Manvat Murders) చేరుతుంది.
నటీనటుల పనితీరు:
రమాకాంత్ కులకర్ణిగా అశుతోష్ గోవారికర్ సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచాడు. సోనాలి కులకర్ణి, సాయి తమన్కర్, మకరంద్ అనస్సురె తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగతావారంతా వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా...
డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ విత్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే.. మస్ట్ వాచెబుల్
రేటింగ్: 3/5
✍️. దాసరి మల్లేశ్