Read more!

English | Telugu

ఓటీటీలోకి మలయాళ ఇండస్ట్రీ హిట్ 'మంజుమ్మల్ బాయ్స్'

ఈ ఏడాది పలు మలయాళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయి. ముఖ్యంగా 'మంజుమ్మల్ బాయ్స్' (Manjummel Boys) వరల్డ్ వైడ్ గా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయగా....ఇక్కడా మంచి వసూళ్లు దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.

తాజాగా 'మంజుమ్మల్ బాయ్స్' సినిమా డిజిటల్ ప్రీమియర్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ సినిమాను మే 5వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.  మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 'మంజుమ్మల్ బాయ్స్' అందుబాటులోకి రానుంది.

2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్ యువకుల సాహసం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను దర్శకుడు చిదంబరం ఎస్ పొదువల్ రూపొందించారు. పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని నిర్మించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు.