Read more!

English | Telugu

మంజుమ్మెల్ బాయ్స్ ఓటిటి డేట్ ఫిక్స్.. ఎన్ని భాషల్లోనో తెలుసా 

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వస్తాయి. రావడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షల వర్షాన్ని కురిపిస్తాయి. అలాంటి సినిమాల్లో ఒకటి  మంజుమ్మెల్ బాయ్స్. పేరుకి మలయాళ చిత్రమే అయినా తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరధం పట్టారు. పైగా  ఇందులో ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేదు.ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ సినీ ప్రియుల్లో ఆనందాన్ని తెస్తుంది.

మంజుమ్మెల్ బాయ్స్  ఫిబ్రవరి 22 న మలయాళంలో విడుదల అయ్యి 200 కోట్లకి పైగా కలెక్షన్ల ని రాబట్టింది. ఇది మలయాళ చిత్ర సీమలోనే ఒక సరికొత్త రికార్డు అని చెప్పవచ్చు .ఇక తెలుగులో ఈ నెల 5 న విడుదల అయ్యి మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడు ఓటిటి లో మే 3 న స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ + హాట్ స్టార్ లో తెలుగు, తమిళ, మలయాళ ,హిందీ ,కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ నుంచి అధికార ప్రకటన కూడా వచ్చింది. దీంతో మే 3 న సినీ ప్రియులు ఫుల్ బిజీ అని చెప్పవచ్చు. 

2006 లో తమిళనాడు లోని గుణ గుహల్లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. షోబున్ షాహిర్, శ్రీనాధ్ బాసి,బాలు వర్గేశ్,అభిరాం రాధాకృష్ణన్, విష్ణు రేగు, చందు, గణపతి ,దీపక్ ,అరుణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో  నటించారు, చిదంబరం దర్శకత్వం వహించగా  షోబున్ షాహిర్,షాన్ ఆంటోనీ, బాబు షాహిర్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీలో  హీరోయిన్ లేదు. సినిమా చూస్తున్నంత సేపు మనం ఆ విషయం గురించి అసలు ఆలోచించం.