Read more!

English | Telugu

మంచు మనోజ్ రాంబో గా వస్తున్నాడా..?

టాలీవుడ్ యంగ్ హీరోస్ లో, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ రియల్ స్టంట్స్ చేయడంలో ముందుంటాడు మంచు మనోజ్. సినిమా హిట్టైనా, ఫ్లాపైనా, మనోజ్ స్పీడ్ లో ఏ మాత్రం తేడా ఉండదు. లేటెస్ట్ గా మనోజ్ సూపర్ హిట్ టైటిల్ రాంబోతో వస్తున్నాడా..? అవునంటున్నాయి సినీవర్గాలు. గతంలో మనోజ్ తో సన్నాఫ్ పెదరాయుడు అనే కామెడీ సినిమా కోసం టీం అప్ అయిన నిర్మాత రమేష్ పుప్పాల, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను పక్కన పెట్టారు. లేటెస్ట్ గా ఆయన రాంబో అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. ఇది మనోజ్ తో సినిమా కోసమే అని సమాచారం. ఒక కొత్త దర్శకుడితో ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం మార్చ్ 4న థియేటర్లలోకి రాబోతున్న తన శౌర్య మూవీ మీదనే మనోజ్ ఆశలన్నీ ఉన్నాయి.