English | Telugu

ప్రాణహాని ఉందన్న మోహన్ బాబుకి మనోజ్ కౌంటర్ 

మంచు మోహన్ బాబు(mohan babu)ఆయన కుటుంబం మధ్య జరుగుతున్న ఆస్తుల గొడవ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.రీసెంట్ గా మోహన్ బాబు తన రెండవ కుమారుడు మనోజ్(manoj)వల్ల తన ప్రాణాలకి ముప్పు ఉందని,రక్షణ కావాలంటూ మోహన్ బాబు రాచకొండ పోలీష్ కమీషనర్ కు ఒక లేఖ ని కూడా రాయడం జరిగింది.

దీంతో ఈ విషయంపై మనోజ్ మాట్లాడుతు నేను ఆస్తుల కోసం ఎప్పుడు ప్రాకులాడ లేదు. ఆస్తులు కావాలని ఇబ్బంది కూడా పెట్టలేదు.డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం కూడా చేయటం లేదు.నేను నా భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నాం.విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతుండటంతో బాధితులకు నేను అండగా ఉన్నాను.ఆ విధంగా బాధితుల పక్షాన నిలబడ్డందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాను.పోలీసులు ఏకపక్షంగా  వ్యవహరిస్తు నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు.

నా భార్యాపిల్లలకు రక్షణ లేకుండా పోయిందనే పోరాటం చేస్తున్నాను.కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను.ఈ వివాదాల్లో నా కూతుర్ని కూడా తీసుకురావడం చాలా బాధాకరం.కొన్నాళ్ల నుంచి నేను, మౌనిక మా ఇంటి నుంచి దూరంగానే ఉంటున్నాం.నా ముందే నా కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారు. ఇంటిలో ఉండాల్సిన సిసి ఫుటేజీ కెమెరాలు మాయమయ్యాయి.నా అన్న విష్ణు దుబాయ్ కి ఎందుకు వెళ్ళాడో అందరికీ తెలుసు.విష్ణు(manchu vishnu)అనుచరులు విజయ రెడ్డి ,కిరణ్ రెడ్డి సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులని కూడా కోరతానని మనోజ్ చెప్పాడు.