Read more!

English | Telugu

క్యాన్సర్ తో టాప్ డైరెక్టర్ మరణం 

ఈ మధ్య కాలంలో దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమలో వరుసగా విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఎంతో మంది సినీ ప్రముఖులు ఆకస్మిక మరణాన్ని పొందుతున్నారు. తాజాగా  ఒక దర్శకుడి మరణం పలువురిని  విషాదంలో ముంచెత్తుతుంది

హరి కుమార్..మలయాళ సినీ రంగంలో పేరు మోసిన దర్శకుడు. కథా రచయిత కూడా. కొంత కాలంగా  క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో  ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కానీ చివరకి పరిస్థితి విషమించడంతో నిన్న తుది శ్వాస విడిచాడు.దీంతో మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యింది. పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేసారు

1981 లో  వచ్చిన  అంబల్ పూ చిత్రం ద్వారా  హరి దర్శకుడుగా తన  సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు.సుకృతం ,ఉద్యాన పా  లకన్, స్వయంవర పంథాల్, ఎజున్న లాట్ , అన్ టోల్డ్ స్టోరీస్ , పులర్ వేతం, ఉజం, జలకం, అయనం ఇలా సుమారు 18 చిత్రాలకి దర్శకత్వం వహించాడు. ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రం కూడా  దేనికదే విభీమన్నమైన సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది .2022 లో వచ్చిన ఆటో రిక్షా కరంటే భార్య ఆయన చివరి చిత్రం.  భార్య పేరు చంద్రిక. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు. ఆయన  కథ ,మాటలు, స్క్రీన్ ప్లే ని అందించిన పలు చిత్రాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి