English | Telugu

మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య.. ఆరంతస్తుల బిల్డింగ్‌ పైనుంచి దూకిన అనిల్‌ అరోరా!

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా, ఐటమ్‌ గర్ల్‌గా ఎంతో పాపులర్‌  అయిన మలైకా అరోరా ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి అనిల్‌ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. బాంద్రాలో ఆయన నివాసం ఉంటున్న ఆరంతస్తుల బిల్డింగ్‌ పైనుంచి దూకి తనువు చాలించారు అనిల్‌. ఆ సమయంలో పూనెలో షూటింగ్‌లో ఉన్న మలైకా విషయం తెలుసుకొని హుటాహుటిన బయల్దేరి ముంబై చేరుకున్నారు. మలైకా మాజీ భర్త అర్బాజ్‌ ఖాన్‌, మాజీ ప్రియుడు అర్జున్‌ కపూర్‌, సలీమ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ తల్లి సల్మా ఖాన్‌, సొహైల్‌ ఖాన్‌ తదితరులు అనిల్‌ నివాసానికి చేరుకున్నారు. బాంద్రా పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని తెలుస్తోంది. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అనిల్‌. మలైకా తల్లి మలయాళీ క్రిస్టియన్‌, తండ్రి పంజాబీ. మలైకా 11 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే వాళ్లిద్దరూ విడిపోయారు. 


హిందీ సినిమాల్లో ఐటెం సాంగ్స్‌ తో పాటు, హీరోయిన్‌ గా నటించి స్టార్‌ ఇమేజ్‌ ను సొంతం చేసుకున్న నటి మలైకా అరోరా తండ్రి అనిల్‌ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ఏడు అంతస్తుల భవనం టెర్రస్‌ నుంచి ఆయన దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలంకు చేరుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. డెడ్‌ బాడీని పోస్ట్‌మార్టంకు పంపించారని తెలుస్తోంది. వయసు మీద పడ్డ నేపథ్యంలో పలు అనారోగ్య సమస్యలు ఆయనను వేధిస్తున్నాయి అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలు కారణమా, మరేదైనా ఉందా అని పోలీసుల ఎంక్వైరీలో తెలియాల్సి ఉంది. అనిల్‌ అరోరాకి మలైకా అరోరాతో పాటు అమృతా అరోరా మరో కూతురు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు అనిల్‌ అరోరా ఆత్మహత్య విషయమై స్పందించలేదు. మరికాసేపట్లో కుటుంబం నుంచి ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.