Read more!

English | Telugu

మోస్ట్ డిజైరబుల్ టాప్ 10 లో మహేష్ బాబు..!

ప్రఖ్యాత సంస్థ టైమ్స్, ప్రతీ ఏడాదీ మోస్ట్ డిజైరబుల్ అన్న దానిపై సర్వే నిర్వహిస్తుంటుంది. వరల్డ్ వైడ్ గానే కాకుండా, దేశాల వ్యాప్తంగా కూడా ఇది జరుగుతుంటుంది. ఈ ఏడాది మన దేశంలో మోస్ట్ డిజైరబుల్ గా నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు రణ్ వీర్ సింగ్. స్టైల్, ఫిజిక్ తో ఎంతో మంది మగువల మనసు, నటనతో కుర్రాళ్ల అభిమానం సంపాదించుకుంటూ, బాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు రణ్ వీర్. ఈ ఏడాది అతని మోస్ట్ డిజైరబుల్ గా నిలవడంలో ఎవరికీ ఆశ్చర్యం లేకపోయినా, స్వయంగా తనే దీనికి షాక్ అవడం విచిత్రం. తన మొదటి సినిమా టైంలో చూడ్డానికి బాగాలేవు అంటూ అందరూ అన్నారని, ఇప్పుడు మోస్ట్ డిజైరబుల్ అనడం చాలా సంతోషంగా ఉందని రణ్ వీర్ అంటున్నాడు. ఇక మన తెలుగు హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇండియా వైడ్ లో 6వ స్థానంలో నిలిచాడు. మొదటి ఐదు స్థానాల్లో రణ్ వీర్, విరాట్ కోహ్లీ, ఫవాద్ ఖాన్, హృతిక్ రోషన్, సిద్దార్ధ్ మల్హోత్రా నిలిచారు. మహేష్ తప్ప టాప్ 10 లో తెలుగు హీరోలెవరూ లేకపోవడం విచిత్రం. రానా కు 11, ప్రభాస్ కు 13, రాంచరణ్ కు 38వ స్థానాలు దక్కాయి.