English | Telugu

ప్రిన్స్ హీరోగా సుకుమార్ చిత్రం ఫిబ్రవరి 12 న

ప్రిన్స్ హీరోగా సుకుమార్ చిత్రం ఫిబ్రవరి 12 న ప్రారంభం కాబోతూందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, "100% లవ్" ఫేం సుకుమార్ దర్శకత్వంలో, రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట, అనీల్‍ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఫిబ్రవరి 12 న ప్రారంభం కాబోతూందని తెలిసింది. ఈ చిత్రంలో హీరో ప్రిన్స్ మహేష్ బాబు కాలేజీ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారట.

ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ పూర్వాశ్రమంలో లెక్కల లెక్చరర్ గా పనిచేశారు. అప్పటి నిజజీవిత సంఘటనల సమ్మేళనంగా ఈ చిత్రం నిర్మించబడుతోందని అంటున్నారు. ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.