English | Telugu

మ‌హేష్‌.. ప్ర‌భాస్‌ని దాటేశాడు...!

బాహుబ‌లి కోసం ప్ర‌భాస్ రూ.24 కోట్ల పారితోషికం తీసుకొన్నాడ‌న్న వార్త సంచ‌ల‌నం సృష్టించింది. టాలీవుడ్‌లో ఓ హీరో అందుకొన్న అత్య‌ధిక పారితోషికం అంది. దాదాపుగా రెండేళ్లు ఆ సినిమా కోసం శారీర‌కంగా, మాన‌సికంగా శ్ర‌మ‌ప‌డ్డాడు ప్ర‌భాస్. అందుకే రూ.24 కోట్లు ఇవ్వ‌డంలో త‌ప్పులేద‌నిపించింది. అయితే... మ‌హేష్ బాబు ఆ రికార్డును బ‌ద్ద‌లుకొట్టాడు. అంత‌కంటే ఒక కోటి ఎక్కువ‌గానే అంటే.. రూ.25 కోట్లు తీసుకొన్నాడు.కానీ.. రెండేళ్లు క‌ష్ట‌ప‌డ‌లేదు, త‌న బాడీనీ క‌ష్ట‌పెట్ట‌నివ్వ‌లేదు. ఇదంతా శ్రీ‌మంతుడు మ‌హేష్ బాబు మ్యాజిక్‌.

శ్రీ‌మంతుడు సినిమాకి మ‌హేష్‌కి అక్ష‌రాలా రూ.25 కోట్లు దక్కింద‌ని టాలీవుడ్ టాక్‌. శ్రీ‌మంతుడు సినిమాకి మ‌హేష్ ఓ నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి పారితోషికంతో పాటు, సినిమాలో వాటా కూడా అందుకున్నాడు. అవి రెండూ క‌ల‌పి అక్ష‌రాలా రూ.25 కోట్ల‌ని టాక్‌.

శ్రీ‌మంతుడు సినిమాకి రూ.80 కోట్ల బిజినెస్ జ‌రిగింది. లాభాల్లో వాటా ద‌క్కించుకొన్న మ‌హేష్‌కి బాగా గిట్టుబాటైంది. అటు పారితోషికం, ఇటు వాటా... రెండు విధాలా ప‌నైంది. మ‌హేష్ కూడా ఇది వ‌ర‌కెప్పుడూ తీసుకోనంత పారితోషికం శ్రీ‌మంతుడుకు తీసుకొన్నా అని కూడా చెబుతున్నాడు. దూకుడు త‌ర‌వాత మ‌హేష్ పారితోషికం రూ.18 కోట్ల‌కు చేరింది. ఇప్పుడు దాన్నీ దాటేశాడు. ఇక‌మీద‌ట మ‌హేష్ తో సినిమా అంటే.. రూ.25 కోట్లు చ‌దివించుకోవాల్సిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.