English | Telugu
థియేటర్ లోపల లైట్ వేసే ఇబ్బంది కలిగిస్తున్నారు..మాధవన్ ఆవేదన
Updated : Apr 5, 2025
మణిరత్నం(Mani ratnam)దర్శకత్వంలో వచ్చిన 'సఖి' మూవీతో తెలుగు ప్రేక్షకులకి అభిమానాన్నిచూరగొన్న మాధవన్(r madhavan)ఆ తర్వాత పలు భాషల్లో పలు బడా డైరెక్టర్ ల చిత్రాల్లో నటించి తన సత్తా చాటాడు.ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్,విలన్ గా చేస్తు సిల్వర్ స్క్రీన్ పై తన హవాని కొనసాగిస్తు వస్తున్నాడు.ఇప్పటి వరకు ఒక నేషనల్ ఫిలిం అవార్డు,ఐదు సార్లు సౌత్ ఫిలిం ఫేర్ అవార్డు,రెండు సార్లు తమిళనాడు స్టేట్ అవార్డులు సాధించాడు.రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న 'టెస్ట్ 'లో కీలక పాత్ర పోషించి ప్రేక్షకులని అలరిస్తున్నాడు.
రీసెంట్ గా మాధవన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఒకప్పుడు మూవీ చూడటమంటేనే ఎంతో వైవిధ్యంతో ఉండేది.జనాలని తోసుకుంటూ టికెట్ కొనడం దగ్గరనుంచి పార్కింగ్ కష్టాలు,ఫ్యామిలీని ఎవరు నెట్టకుండా చూడటం,ఇంటర్వెల్ లో తినడానికి సమోసా, పాప్ కార్న్ ఈ విధంగా మూవీ చూసాక ప్రేక్షకుడికి ఎంతో అనుభూతి ఉండేది.కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.థియేటర్ లోపలకే మెను వస్తుంది.
మనం మూవీ చూస్తుంటే సడెన్ గా మొబైల్ ఫోన్ ప్లాష్ లైట్ వెలుగుతుంది.మెను ఏం వచ్చిందో చెక్ చేసుకునే దాకా లైట్ వెలుగుతూనే ఉంటుంది.పానీ పూరి వస్తే అందులో పని ఎలా ఉందో కూడా తీరిగ్గా
చూస్తారు.పైగా సినిమా ఏ మాత్రం బాగోకపోయినా మనతో వచ్చిన వాళ్ళు సినిమా బాగోలేదని థియేటర్(Theater)లోనే మాట్లాడుకుంటు ఉంటారు.మూవీ క్లైమాక్స్ కి వచ్చే సరికి పార్కింగ్ ఏరియా నుంచి బయటపడాలనే ఉద్దేశ్యంతో,మనం సినిమా చూస్తుంటే అడ్డంగా మన ముందు నుంచే వెళ్తు ఇబ్బంది కలిగిస్తారని చెప్పుకొచ్చాడు.