English | Telugu

హార్జ్ డిస్క్ దొరికింది కాబట్టి థియేటర్ లో పాత కథ, ఓటిటి లో కొత్త కథ 

ఏ భాషకి చెందిన సినిమా అయినా కూడా థియేటర్ లో ఏ విధమైన కథతో రిలీజ్ అవుతుందో,ఓటిటి లో కూడా అదే కథతో రిలీజ్ అవుతుంది. మహా అయితే థియేటర్ లో ఉండగానే కొన్ని సీన్స్ యాడ్ చేస్తారు.కానీ ఇప్పుడు ఓటిటి రిలీజ్ లో  కొత్త సీన్స్ యాడ్ అవ్వబోతున్నాయి. దీంతో కథ స్వరూపమే మారిపోయే పరిస్థితి.    

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ లాల్ సలాం. భారీ పరాజయాన్ని అందుకోగా  విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ లు మెయిన్ రోల్ ని పోషించారు. ఇప్పుడు ఈ మూవీ త్వరలోనే ఓటిటి లోకి అడుగుపెట్టనుంది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియచేసిన  ఐశ్వర్య ఇంతవరకు ఎవరకి తెలియని మరిన్ని కీలక విషయాలని వెల్లడి చేసింది. హార్డ్ డిస్క్ మిస్  అవ్వడం వలన కొన్ని కీలకమైన సన్నివేశాలు  లేకుండానే లాల్ సలాం ని రిలీజ్ చేసాం.అందుకే ప్రేక్షకులని అంతగా  మెప్పించలేకపోయింది. కానీ ఇప్పుడు హార్డ్ డిస్క్ దొరకడం వలన మిస్ అయిన సీన్స్ అన్నింటిని యాడ్ చేసి త్వరలోనే ఓటిటి లో విడుదల చేయబోతున్నాం.రెహమాన్ కూడా ఆ సీన్స్ అన్నింటికీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఇచ్చేందుకు వర్క్ చేస్తున్నారు. ఇందుకు ఎలాంటి రెమ్యునరేషన్ ని కూడా ఆయన  తీసుకోవడం లేదని వెల్లడి చేసింది. 

అంతే కాకుండా మొదట రాసుకున్న స్కిప్ట్ ప్రకారం రజనీ క్యారక్టర్  పది నిమిషాల మాత్రమే  ఉంటుందని, అది కూడా సెకండ్ ఆఫ్ లో ఎంటర్ అవుతుందని, కానీ జైలర్ తర్వాత వస్తున్న సినిమాగా అభిమానులు నిరాశపడకూడదని  ఫస్ట్ నుంచి ఆ క్యారక్టర్ ఉండేలా  స్క్రిప్ట్ లో మార్పులు చేసాం.కానీ కంటెంట్ బలంగా ఉన్నా కూడా చివరి నిమిషంలో చేసిన  మార్పుల వల్లే అనుకున్న స్థాయిలో మూవీ ఆడలేదని కూడా  చెప్పుకొచ్చింది.అనంతిక, ధన్య బాలకృష్ణ హీరోయిన్లుగా చెయ్యగా నిరోషా ముఖ్య పాత్రలో చేసింది.