English | Telugu

మ‌హేష్‌ని మ‌ర్చిపోలేక‌పోతున్నా

మ‌హేష్ బాబు ప‌క్క‌న ఛాన్సొస్తే... అదో అద్భుత‌మైన అవ‌కాశం అనుకొంటారు క‌థానాయిక‌లు. కృతిస‌న‌న్‌కి ఆ అవ‌కాశం తొలి సినిమాతోనే వ‌చ్చేసింది. మోడ‌ల్ రంగం నుంచి స‌రాస‌రి... ఫిల్మ్ ఇండ్ర‌స్ట్రీలోకి అడుగుపెట్టిన కృతి.. `నేనొక్క‌డినే` సినిమాలో మ‌హేష్‌తో జ‌త క‌ట్టింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా... కృతికి తెలుగులో అవ‌కాశాలొచ్చాయి. వ‌న్ సినిమా ఫ్లాప్ అయినందుకు నాకేబాధా లేదు.. మ‌హేష్ తో క‌ల‌సి న‌టించే గోల్డెన్ ఛాన్స్ వ‌చ్చింది.. దాని ముందు ఎన్నిహిట్ల‌యినా దిగ‌దుడుపే అంటోంది కృతి. మ‌హేష్ తో క‌ల‌సి న‌టించిన రోజులు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేక‌పోతోంద‌ట‌. మ‌హేష్ ఓ సూప‌ర్ స్టార్‌.. అయినా చాలా సింపుల్‌గా ఉంటాడు, అంత సింప్లిసిటీ ఎవ్వ‌రికీ రాదు... అని కితాబిచ్చింది. మ‌రోసారి ప్రిన్స్‌తో న‌టించే ఛాన్స్ వ‌స్తే.. చేతిలో ఎన్ని సినిమాలున్నా వ‌దిలేయ‌డానికి సిద్ధ‌మంటోంది కృతి. మ‌హేష్ అంటే త‌న‌కెంత ఇష్ట‌మో.. దీనికంటే బాగా ఎలా చెబుతుంది? మ‌రి మ‌హేష్ మ‌ళ్లీ ఈ పొడుగుకాళ్ల సుంద‌రిని క‌నిక‌రిస్తాడా?? చూడాలి మ‌రి.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.